అంతా కోహ్లీనే చేశాడా..! తేడా ఎక్కడొచ్చింది..!
ఆస్ట్రేలియా టూర్లో భారతజట్టు ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నది. మూడు మ్యాచ్‌ల సీరిస్‌లో 2-1తో ఓటమిపాలైంది. వరసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయింది. మూడో మ్యాచ్‌లో గెలవడంతో కనీసం పరువైనా దక్కింది. అయితే భారత్జట్టు వైఫల్యానికి కోహ్లీ సారథ్యమే ప్రధానకారణమన్న విశ్లేషణ కొనసాగుతున్నది. జట్టు కూర్పు విషయంలో అతడు వ్యవహరించిన తీరువల్లే టీం ఇండియా వరస ఓటములును కూడగట్టుకున్నదన్న విశ్లేషణలు మొదలయ్యాయి. కోహ్లీ వ్యూహాలు బెడిసికొట్టినట్టు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో టీంఇండియా చతికిలపడింది. అయితే టీం ఇండియాకు ఆల్‌రౌండర్లు లేకపోవడమే పెద్ద లోపమని కొందరు భావిస్తున్నారు. గతం లో సచిన్, సెహ్వాగ్ లాంటి బ్యాట్స్మెన్లు బౌలింగ్ లోనూ రాణించేవారు.
కానీ ప్రస్తుతం బౌలింగ్ చేయగల బ్యాట్స్మెన్లు లేరు. దీంతో బుమ్రా, షమిని నమ్ముకున్న టీంఇండియా చతికిలపడింది. వాళ్లిద్దరూ ఈ సీరిస్‌లో దారుణంగా ఫెయిలయ్యారు. బుమ్రా మాయ ఏమాత్రం పనిచేయలేదు. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ఏ మాత్రం భయపడకుండా బుమ్రా, షమీ బౌలింగ్ లో పరుగుల వరద కురిపించారు. మరోవైపు మన బ్యాట్స్‌మెన్ కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. రోహిత్‌శర్మ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ను పక్కన పెట్టడం కూడా సరికాదన్న వాదన వచ్చింది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తో బలవంతంగా బౌలింగ్ చేయించినా ప్రయోజనం లేకుండా పోయింది.
తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకున్న భారత జట్టు చివరి మ్యాచ్ లో సమష్టిగా రాణించి విజయాన్నందుకుంది. ముఖ్యంగా రెండు వన్డేల్లో తేలిపోయిన బుమ్రా తన అసలు సత్తాను కీలక సమయంలో చూపించాడు. ఆసీస్ విజయానికి చేరువైన దశలో అద్భుత బంతితో మ్యాక్స్‌వెల్ వికెట్ తీసి జట్టుకు గెలుపు బాట పరిచాడు. ఆరు, ఏడు స్థానాల్లో ఆడే ఆల్‌రౌండర్లు బ్యాటింగ్ లో ఎంత బలంగా ఉండాలో పాండ్యా, జడేజా భాగస్వామ్యం చూపించింది. ముఖ్యంగా ఎంతో నమ్మకం పెట్టుకున్న జడేజా అర్ధ సెంచరీ విజయానికి పనికొచ్చింది. టీం ఇండియాలో బౌలర్లు మరింత రాణించాల్సి ఉంది.