భ‌ద్ర‌తా మండ‌లిలో క‌శ్మీర్ చ‌ర్చ‌... హ‌ఠాత్తుగా మారిన ప‌రిణామం

Update: 2019-08-17 12:04 GMT
పాకిస్థాన్‌ కు షాక‌య్యే ప‌రిణామం.. భార‌త్ నుంచి వ్య‌క్త‌మైంది. జ‌మ్ము క‌శ్మీర్‌ కు సంబంధించిన ఆర్టిక‌ల్ 370, 35ఏ ల‌ను ర‌ద్దు చేసిన భార‌త ప్ర‌భుత్వం జ‌మ్ము క‌శ్మీర్‌ ల‌ను విడ‌గొట్టి కేంద్ర‌పాలిత ప్రాంతాలుగా చేసింది. దీనిపై పాకిస్థాన్ పెద్ద ఎత్తున ర‌గ‌డ సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే. పాక్ విజ్ఞ‌ప్తిపై దీనిని చ‌ర్చకు తీసుకు న్న ఐక్య‌రాజ్య‌స‌మితిలోని భ‌ద్ర‌తా మండ‌లి(యూ ఎన్ ఎస్ సీ) తాజాగా దీనిపై చ‌ర్చింది. ఈ క్ర‌మంలోనే శుక్ర‌వారం భ‌ద్ర‌తా మండ‌లిలో భార‌త శాశ్వ‌త స‌భ్యుడు సయ్యద్ అక్బరుద్దీన్ భార‌త వైఖ‌రిని వెల్ల‌డించారు.

జాతీయ స్థాయిలో కాశ్మీర్ కు సంబంధించిన వ్యవహారం పూర్తిగా భారతదేశం యొక్క అంతర్గత విషయమని పేర్కొ న్నారు. క‌శ్మీర్‌ లో శాంతి సుమాలు పూచేందుకు భార‌త్ క‌ట్ట‌బ‌డి ఉంద‌న్న ఆయ‌న భార‌త్ తీసుకున్న నిర్ణ‌యాన్ని స‌మ‌ర్ధించేలా ప్ర‌సంగించారు. ఇదిలావుంటే, స‌మావేశం అనంత‌రం, మీడియా స‌మావేశానికి హాజ‌ర‌య్యారు సయ్యద్ అక్బరుద్దీన్ . ఈ క్ర‌మంలోనే పాక్ జ‌ర్న‌లిస్టులు ముగ్గురికి ఆయ‌న షాక్ ఇచ్చారు.

తొలుత పాక్ జ‌ర్న‌లిస్టు ఒక‌రు .. క‌శ్మీర్ విష‌యంపై మీరు మా దేశంతో ఎప్పుడు మాట్లాడ‌తార‌ని ప్ర‌శ్నించారు. దీనికి ఆయ‌న నేరుగా స్పందించ‌కుండా తాను కూర్చున్న సీటులోంచి లేచి స‌ద‌రు జ‌ర్న‌లిస్టు వ‌ద్ద‌కు వ‌చ్చి.. ముందుగా క‌ర‌చాల‌నం చేశారు. త‌ద్వారా భార‌త్ మ‌నోగ‌తాన్ని ఆయ‌న పాక్‌ కు చెప్ప‌క‌నే చెప్పిన‌ట్ట‌యింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆ వెంట‌నే ఆయ‌న మాట్లాడుతూ.. పాక్‌ తో అన్ని విష‌యాలు చ‌ర్చించేందుకు భార‌త్ సిద్ధంగానే ఉంద‌ని చెప్పారు. అయితే, సీమాంత‌ర ఉగ్ర‌వాదాన్ని పోషిస్తూ.. జీహాదీ ప‌లుకులు ప‌లుకుతున్న పాక్ త‌న వైఖ‌రి లో ముందు మార్పు తెచ్చుకోవాల‌ని చుర‌క‌లు అంటించారు.

అదే స‌మ‌యంలో ఆయ‌న బార‌త్ వైఖ‌రిని స్ప‌ష్టం చేస్తూ. క‌శ్మీర్ విష‌యం పూర్తిగా భార‌త అంత‌ర్గ‌త విష‌య‌మ‌ని పేర్కొన్నారు. సిమ్లా ఒప్పందానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఒక దేశం.. అందునా సోద‌ర దేశం.. తమ నాయకులతో సహా భారతదేశంలో హింసకు వ్యతిరేకంగా జిహాద్ పరిభాషను వినియోగించడం ఆశ్చర్యంగా ఉందని అక్బ‌రుద్దీన్ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ ప‌రిణామంతో పాక్ జ‌ర్న‌లిస్టులు మిన్న‌కుండిపోయారు.
    
    


Tags:    

Similar News