మైనస్ 11.5శాతానికి పడిపోయిన భారత వృద్ధిరేటు
కరోనా మహమ్మారి నేపథ్యంలో భారత జీడీపీ మైనస్ లలోకి జారీ పోయింది. ఎంతలా అంటే కనివినీ ఎరుగని రీతిలో గత నెలలో ఏకంగా మైనస్ 23.9కు దిగజారిందని ఆర్థిక సంస్థలు తెలిపాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఈ దారుణ పతనం వెలుగుచూసిందని రేటింగ్ ఏజెన్సీలు వెల్లడిస్తున్నాయి.
తాజాగా ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ‘మూడీస్’ 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ రేటుకు భారీ కోత విధించింది. ఏకంగా -11.5 శాతం మేర కుచించుకుపోనుందని అంచనావేసింది. కరోనా లాక్ డౌన్లు భారత ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపినట్లు మూడీస్ అభిప్రాయపడింది. లాక్ డౌన్ వల్ల భారత జీడీపీ తీవ్ర ప్రభావానికి లోను కాగా.. 2021 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు అంచనాలను -11.5గా లెక్కగట్టింది.
ముందుగా -4శాతం అంచనావేయగా.. తొలి త్రైమాసికం ఫలితాల తర్వాత దానిని -11.5శాతంగా అంచనా వేసింది. మొదట అంచనావేసి ఇప్పుడు దానిని సవరించి గత అంచనాలతో పోలిస్తే రెండింతల కంటే ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
ఏప్రిల్-జూన్ క్వార్టర్ లో ప్రపంచంలోనే అత్యల్ప వృద్ధి రేటు నమోదైన దేశాల్లో భారత్ ఒకటి అని తెలిపింది. భారత్ తోపాటు బ్రిటన్ , స్పెయిన్ లలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని మూడీస్ సంస్థ తెలిపింది. లాక్ డౌన్ తో ప్రజారవాణా, కొనుగోళ్లపై భారీ ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంది.