టిక్ టాక్ తరహాలో త్వరలో చైనాకు మరో షాక్?
కొద్ది నెలలుగా భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నిస్తోన్న చైనా బలగాలకు భారత సైన్యం దీటుగా జవాబిస్తోంది. ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా డ్రాగన్ తీరు మారకపోవడంతో...ఏకంగా అరుణాచల్ ప్రదేశ్ సమీపంలోని సరిహద్దులో ఓ గ్రామం తమదేనంటూ కోతలు కోస్తోంది చైనా. ఈ క్రమంలోనే భారత దేశ సార్వభౌమత్వం, సమగ్రత, భద్రత, సమాచార గోప్యతకు భంగం కలిగిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే 267 చైనా యాప్ లపై భారత్ నిషేధం విధించింది. టిక్ టాక్, పబ్ జీ వంటి ప్రముఖ యాప్ లతో అలీ ఎక్స్‌ప్రెస్, స్నాక్ వీడియో, మ్యాంగో టీవీ వంటి పలు యాప్ లపై ఉక్కుపాదం మోపింది. డ్రాగన్ దేశపు ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడం ద్వారా బుద్ధి చెప్పాలని మోడీ సర్కార్ పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే చైనాకు తాజాగా కేంద్రం మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. చైనాకు చెందిన కొన్ని టెలికాం సంస్థలను బ్లాక్ లిస్ట్ లో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. టెలికాం రంగంలో ట్రస్టెడ్ వెండర్స్ ను నిర్దేశిస్తూ తద్వారా సమాచార రంగంలో భధ్రతను మరింత పెంచాలని భావిస్తున్నట్టు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు.
సమాచార భద్రత, గోప్యతకు సంబంధించి కేబినెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం వెల్లడించారు.
ట్రస్టెడ్ వెండర్స్‌ను నిర్దేశిస్తూ టెలికాం రంగం భద్రతను పెంచాలని నిర్ణయించామని ఆయన అన్నారు. కంపెనీలు ట్రస్టెడ్ సోర్స్ నుంచి టెలికాం ఎక్విప్‌మెంట్‌ను కొనుక్కోవచ్చని, దేశ భద్రతకు ఇది చాలా ముఖ్యమైన చర్య అని చెప్పారు. అయితే, ఆపరేటర్స్ దగ్గర ఇప్పటికే ఉన్న టెలికాం ఎక్విప్‌మెంట్‌పై తాజా నిర్ణయం ప్రభావం ఉండదని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. చైనాపై దృష్టితో ఈ నిర్ణయం తీసుకున్నారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు రవిశంకర్ ప్రసాద్ సమాధానం దాటవేశారు. అయితే, ఎక్విప్‌మెంట్ కొనుగోలుకు నమ్మకస్థుల జాబితాను కూడా కేంద్రం తయారు చేయబోతోందని తెలుస్తోంది. రవిశంకర్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని కొన్ని చైనా టెలికాం కంపెనీలపై త్వరలో ఆంక్షలు విధించే అవకాశం ఉందని టెలికాం రంగ నిపుణులు, పరిశీలకులు భావిస్తున్నారు. చైనాకు చెందిన పలు యాప్ లపై ఉక్కుపాదం మోపిన కేంద్రం....తర్వాతి విడతలో టెలికాం ఎక్విప్‌మెంట్ వెండర్లపై వేటు వేయబోతోందని అభిప్రయాపడుతున్నారు. అయితే, ఇందుకు సంబంధించి రవిశంకర్ ప్రసాద్, కేంద్ర ప్రభుత్వం తరఫునుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.