హైదరాబాద్ బిర్యానీ తిని అస్వస్థత.. ! ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ఆస్పత్రిపాలు..!
హైదరాబాద్ బిర్యానీ తిని ఓ కుటుంబం మొత్తం అస్వస్థతకు గురైంది. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగుచూసింది. మల్కాజ్‌గిరికి చెందిన ఓ కుటుంబం .. ఇటీవల ఆనంద్ బాగ్ లోని 'మజ్లిస్ అల్ మండి' లో బిర్యానీ తిన్నారు. వివాహ వార్షికోత్సవం ఉండటంతో ఆ కుటుంబం మొత్తం కలిసి.. ఓ హోటల్‌కు వెళ్లింది. బిర్యానీ తిన్నాక కుటుంబసభ్యులు అస్వస్థతకు గురయ్యారు. ఆ కుటుంబంలోని ఐదుగురు పిల్లలు, ముగ్గురు పిల్లలు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. అయితే ఫుడ్ పాయిజన్ అయిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
గత ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.వెంటనే సదరు హోటల్‌పై చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. హైదరాబాద్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది బిర్యానీ. అంతలా బిర్యానీ ఫేమస్ అయ్యింది. సొంత పనుల కోసం వివిధ పట్టణాల నుంచి నగరానికి వచ్చిన వాళ్లు హైదరాబాద్ బిర్యానీ రుచి చూడకుండా వెళ్లరు.
హైదరాబాద్‌లో ఉండేవాళ్లు కూడా వారానికోసారైనా రెస్టారెంట్ కు వెళ్లి బిర్యానీ తింటుంటారు. నగరంలో ఉన్న ప్రతి రెస్టారెంట్లో బిర్యానీ ఉంటుంది. అటువంటింది ఇప్పుడు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో బిర్యానీ ఫుడ్ పాయిజన్ కావడం చర్చనీయాంశం అయ్యింది. ఈ విషయంపై హోటల్ యాజమాన్యం ఇంకా స్పందించలేదు.