ఆవాలు చేసే అద్భుతాలు తెలిస్తే.. అస్సలు వదలరు..!

Update: 2021-02-02 01:30 GMT
మనందరి ఇంట్లో  ఉండే పోపులపెట్టెలో ఆవాలు కచ్చితంగా ఉంటాయి. మనం తరచూ అన్ని వంటల్లోనూ ఆవాలు వాడుతుంటాం. కానీ ఈ ఆవాలతో ఉండే ప్రయోజనాలు చాలా మందికి తెలియదు. ఆవాలు సర్వరోగనివారిణి అని ఇప్పుడు శాస్త్రవేత్తలు సైతం సైతం అంటున్నారు. నిజానికి భారతీయుల వంటిళ్లు ఓ ఆయుర్వేద చికిత్సాలాయం. అక్కడ దాదాపు అనేక రోగాలను నయం చేసే దినుసులు ఉంటాయి. వెల్లుల్లి, అల్లం, యాలకులు, లవంగాలు, మిరియాలు, మెంతులు, జీలకర్ర ఇలా ప్రతి దినుసుకు ఏదో ఒక ఆరోగ్య ప్రయోజనం ఉంటుంది.

 కానీ వాటితో కలిగే లాభాలు ఏమిటో చాలామందికి తెలియకపోవచ్చు. ఆవాలతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు ఉంటున్నారు. ఆవాల వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆవాల్లో ఫోటోన్యూట్రియెంట్ గుణాలు ఉంటాయి.  పీచు పదార్థాల శాతం అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. జీర్ణవ్యవస్థకు వచ్చే క్యాన్సర్లు తగ్గుతాయి. మలబద్దకం ఉండేవాళ్లు తరుచూ ఆవాలు తీసుకోవాలి.
ఆవాల్లో సెలీనియమ్, మెగ్నీషియమ్ శాతం ఎక్కువ.దీనివల్ల నొప్పులు తగ్గుతాయి.

 అంతేకాక ఆవాలు తరుచూ  తీసుకోవడం వల్ల ఉబ్బసం ( ఆస్తమా) కూడా తగ్గుతుంది. జలుబు, ఛాతీ పట్టేయడం వంటి లక్షణాలకు కూడా ఆవాలు గొప్ప ఔషధం. అధిక బరువు ఉన్నవాళ్లు ఆవాలు తీసుకోవడం మంచిది. వారి శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వును ఇవి కరిగించేస్తాయి. ఆవాల్లో బీ కాంప్లెక్స్​ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇమ్యూనిటీ పెరిగి జీవక్రియలు వేగవంతం అవుతాయి.

ఆవాలలోని కెరోటిన్స్, జియాగ్జాంథిన్స్ , ల్యూటిన్ వంటి పోషకాలు వయసు పెరగడం వల్ల వచ్చే అనార్థాలను తగ్గిస్తాయి.ఆవాలు రక్తంలో పేరుకుపోయిన మలినాలను తొలగించడంతో పాటు జుట్టు ఒత్తుగా పెరగడానికి కూడా ఉపయోగ పడతాయట. అందుకే మీ ఆహారంలో ప్రతిరోజు ఆవాలు ఉండేలా చూసుకోండి.
Tags:    

Similar News