స్మార్ట్ కండోమ్.. ఇది పెట్టుకుంటే మీరు రెచ్చిపోతారు..

Update: 2020-02-26 20:30 GMT
మార్కెట్లోకి కొత్త సరకు వచ్చింది. అదే స్మార్ట్ కండోమ్! ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని ఉందా? అయితే, చూడండి. చాలామందికి తమ సెక్స్ సామర్థ్యం పై చాలా అనుమానం ఉంటుంది. అలాంటివారికి ఈ స్మార్ట్ కండోమ్ భలే నచ్చేస్తుంది. బ్రిటన్‌కు చెందిన కండోమ్ సంస్థ ‘ఐ.కాన్’  అనే ఈ స్మార్ట్ కండోమ్‌ను రూపొందించింది. ఇది అన్ని సైజుల్లోనూ లభిస్తుంది. దీన్ని పెట్టుకుంటే మీ సెక్స్ జీవితం జింగాలాలా అంటూ ఆ సంస్థ ప్రకటిస్తోంది. ఇది మీ సెక్స్ సామర్థ్యాన్ని అంచనా వేయడంతో పాటు.. సంక్రమణ వల్ల ఏర్పడే ఇన్ఫెక్షన్లను సైతం గుర్తిస్తుంది. రెచ్చిపోయేలా చేస్తుందట..

ఐ.కాన్ సాధారణ కండోమ్‌ల్లా ఉండదు. ఇది రింగు ఆకారంలో ఉంటుంది. దీన్ని కండోమ్‌పైన ధరించాలి. ఇందులో నానో చిప్స్‌తో పాటు సెన్సార్లు కూడా ఉంటాయి. బ్యాటరీ ఛార్జింగ్ కోసం మైక్రో యూఎస్‌బీ పోర్ట్ కేబుల్ కూడా ఇచ్చారు. దీన్ని బ్లూతూత్ ద్వారా మీ స్మార్ట్‌కు అనుసంధానం చేసుకోవాలి. దీన్ని రబ్బరుతో తయారు చేశారు. దీనివల్ల ఏ ‘సైజు’కైనా సరిగ్గా సరి పోతుంది. సెక్స్ చేస్తున్న సమయం లో దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీన్ని ఎన్ని సార్లయినా వాడవచ్చు. శృంగార సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తుంది.

ఇందుకు మీ స్మార్ట్ ఫోన్‌ను స్మార్ట్ కండోమ్‌ తో పెయిర్ చేసుకోవాలి. సో, మీ సెక్స్ సామర్థ్యం గురించి ఏమైనా అనుమానాలు ఉండి ఉంటే ఈ కండోమ్ వాడి తెలుసుకోవచ్చు. తర్వాతి కలయిక లో మరింత మెరుగైన సామర్థ్యం ప్రదర్శించేందుకు సన్నద్ధం కావచ్చు. ఈ కండోమ్ విలువ భారత కరెన్సీ ప్రకారం రూ.5వేలు ఉంది. అయితే, ఇది ఇంకా మార్కెట్లోకి అందుబాటు లోకి రాలేదు. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే లభిస్తున్నాయి.
Tags:    

Similar News