రోగాలను అడ్డుపెట్టి.. 'సాఫ్ట్'గా దొరికిపోయారుగా
దురాశ దుఃఖానికి చేటు -అన్నారు పెద్దలు. ఖచ్చితంగా ఈ ఫార్ములానే ఫాలో అయిపోయిన దాదాపు 200 మంది అడ్డంగా దొరికి అవమాన భారంతో కుంగిపోతున్నారు. ఉన్నత జీతం తీసుకుంటున్నవారు ఏటా ప్రభుత్వానికి పన్నులు చెల్లించడం కామనేకదా! అయితే, కొన్ని కొన్ని కారణాలను చూపించి.. కొంత వరకు పన్నులు మినహాయింపు పొందవచ్చని ప్రభుత్వమే సెలవిచ్చింది. దీనికి సక్రమంగా వినియోగించుకుంటే.. ఎలాంటి గొడవా ఉండదు. ఇటు మనకీ, అటు ప్రభుత్వానికి కూడా మంచిదే!
అయితే, ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని మరింతగా వాడేసుకోవాలనుకున్నారు ఓ 200 మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. అయితే, విషయం పసిగట్టిన ఐటీ అధికారులు.. గుండుగుత్తుగా 200 మందిపైనా కేసులు బుక్ చేశారు. విషయంలోకి వెళ్తే.. ఈ ఏడాది ఆదాయపు పన్ను రిటర్న్ సమర్పించ్సాల్సిన గడువు జూలైతో ముగిసింది. దీంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే, భారీ మొత్తంలో జీతాలు ఉండడంతో వీరు పన్నులు కూడా భారీగానే చెల్లించాల్సి వస్తోంది. అయితే, ప్రభుత్వం ఇచ్చిన అవకాశం మేరకు సెక్షన్ 80 కింద కొంతమేరకు మినహాయింపులు పొందారు.
అయితే, ఇక్కడే వీరు దురాశకు పోయారు. 80 సీసీ కింద ఉన్న మానసిక వైకల్యం - కంటిచూపు కోల్పోవడం - కుష్ఠు రోగాలు - చెవుడు వంటి సమస్యలకు ఉన్న రాయితీని వీరు కూడా వినియోగించుకున్నారు. తమ మీద ఆధారపడిన కుటుంబసభ్యులకు కూడా ఈ రాయితీలు వర్తిస్తాయి. దీన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది ఐటీ ఉద్యోగులు ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ తో ఒక ఆటాడేసుకున్నారు. మొత్తం 200 మంది ఈ విధంగా అప్లై చేసుకున్నారు. ఫలితంగా కోటీ 36 లక్షలకు పైగా ఐటీకి నష్టం వచ్చింది.
విషయాన్ని గ్రహించిన అధికారులు వీరు సమర్పించి ఐటీ రిటర్న్స్ పై కూపీలాగారు. శ్రీకాంత్ గౌడ్ - మహమ్మద్ ఖలీల్ అనే ఇద్దరు ఇన్ కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్లు ఈ ఐటీ ఉద్యోగులతో ఈ విధంగా అప్లై చేయించినట్టు గుర్తించారు. దొంగ క్లెయిములు పుట్టించారు. దీంతో.. నాలుగురోజుల క్రితం దీనిపై అధికారులు చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఐపీసీ 420 - ఐపీసీ 406 సెక్షన్ల కింద ఈ ప్రాక్టీషనర్ల మీద ఫిర్యాదు నమోదైంది. మొత్తంగా ఐటీ కళ్లకు గంతలు కట్టాలని చూసి.. వీరి చేతులకు బేడీలు వేయించుకున్నారు.