హార్దిక్ పాండ్య కోసం 7 ఫ్రాంచైజీల క్యూ.. ముంబై 'కెప్టెన్సీ' సర్కస్ మళ్లీ మొదలైందా బాసూ

ఐపీఎల్ అంటేనే డ్రామా... అందులోనూ ముంబై ఇండియన్స్, హార్దిక్ పాండ్య కాంబినేషన్ ఉంటే ఆ డ్రామా నెక్స్ట్ లెవెల్.. మొన్నటివరకు "రోహిత్ శర్మను తీసేసి హార్దిక్‌కు కెప్టెన్సీ ఇస్తారా?" అంటూ ఫ్యాన్స్ గుండెలు బాదుకున్నారు.

Update: 2026-07-01 15:30 GMT

ఐపీఎల్ అంటేనే డ్రామా... అందులోనూ ముంబై ఇండియన్స్, హార్దిక్ పాండ్య కాంబినేషన్ ఉంటే ఆ డ్రామా నెక్స్ట్ లెవెల్.. మొన్నటివరకు "రోహిత్ శర్మను తీసేసి హార్దిక్‌కు కెప్టెన్సీ ఇస్తారా?" అంటూ ఫ్యాన్స్ గుండెలు బాదుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. 2027 ఐపీఎల్ ట్రేడ్ మార్కెట్‌లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య హాట్ కేకులా మారిపోయారు. గత సీజన్‌లో ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలవడంతో "ఇక ఇక్కడ ఉంటే లాభం లేదు.. రూటు మారుద్దాం" అని హార్దిక్, "నీకు దండం రా బాబు" అని ముంబై మేనేజ్‌మెంట్ అనుకుంటున్నారట... ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ఏంటంటే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ , ఆర్సీబీ మినహా మిగిలిన 7 ఫ్రాంచైజీలు హార్దిక్ కోసం ఎగబడుతున్నాయట.

రేసులో ఉన్న 'బిగ్ త్రీ'.. ఎవరి ప్లాన్ వారిదే!

జాతీయ మీడియా కోడై కూస్తున్న దాని ప్రకారం.. హార్దిక్ కోసం మూడు జట్లు గట్టిగా ట్రై చేస్తున్నాయి. వాటి ప్లాన్లు చూస్తే నవ్వుకోవాలో, ఆశ్చర్యపోవాలో అర్థం కావడం లేదు. ధోనీ తర్వాత టీంను నడిపించే ‘తల’ దొరకలేదని హార్దిక్ వైపు చూస్తున్నారు. కానీ ట్విస్ట్ ఏంటంటే.. "మా జట్టులోకి రావచ్చు కానీ.. కెప్టెన్సీ మాత్రం గ్యారెంటీ లేదు" అని కండిషన్ పెట్టారట. పాండ్య భయ్యాకు కెప్టెన్సీ లేకపోతే ముద్ద దిగదు కదా.. మరి దీనికి ఆయన ఒప్పుకుంటాడా?

ఇక కోల్‌కతా నైట్ రైడర్స్.. వీళ్లకు ఒక పర్మినెంట్ కెప్టెన్ కావాలి. అందుకే "నువ్వు రా బాసూ.. డైరెక్ట్‌గా కెప్టెన్ సీట్లోనే కూర్చోబెడతాం" అని బంపర్ ఆఫర్ ఇచ్చారట... మరో టీం రాజస్థాన్ రాయల్స్.. వీరు కూడా లాంగ్ టర్మ్ ప్లాన్స్‌తో హార్దిక్‌కు కెప్టెన్సీ ఇస్తామంటూ ఎర వేస్తున్నారు.

ట్రేడింగ్ అంటే అంత ఈజీ కాదు గురూ!

"ఐపీఎల్ ట్రేడింగ్ అనేది కిరాణా షాపులో సామాన్లు కొన్నంత ఈజీ కాదు. ఇరు జట్ల మేనేజ్‌మెంట్‌లతో పాటు, సదరు ప్లేయర్ ఇగో.. సారీ, సమ్మతి కూడా చాలా ముఖ్యం" అని క్రికెట్ విశ్లేషకుల అంతరంగం.. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే.. సీఎస్కే హార్దిక్‌ను తీసుకోవాలంటే బదులుగా ముంబైకి ఎవరిని ఇస్తుంది? దూబేనా? రుతురాజ్ నా? అలాగే కేకేఆర్ దగ్గర ముంబైని మెప్పించే రేంజ్ ఆటగాళ్లు ఉన్నారా? అంతా క్యాష్ డీల్ చేయాలన్నా హార్దిక్ ప్రైస్ ట్యాగ్ సామాన్యమైనది కాదు.

అంతా 'లీకుల' మహిమేనా?

గతంలో గుజరాత్ నుండి ముంబైకి హార్దిక్ వచ్చినప్పుడు కూడా ఇలాగే అంతా షాకయ్యారు. కాబట్టి ఈ 'మెగా ట్రేడ్' జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఇప్పటివరకు ఏ ఫ్రాంచైజీ కూడా దీనిపై అధికారికంగా నోరు విప్పలేదు. ఇవన్నీ ప్రస్తుతానికి సోషల్ మీడియా రూమర్లు, లీకులే.. ఒకవేళ హార్దిక్ నిజంగానే ముంబైని వీడితే.. ముంబై ఫ్యాన్స్ ఆనందపడాలా, లేక కొత్త కెప్టెన్ ఎవరు వస్తారా అని టెన్షన్ పడాలా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే. చూద్దాం, ఈ ఐపీఎల్ ట్రేడ్ విండో ముగిసేలోపు ఇంకెన్ని కోతి కొమ్మచ్చి ఆటలు చూడాల్సి వస్తుందో..

Tags:    

Similar News