సంచయితపై ఊర్మిళ సంచలన వ్యాఖ్యలు
విజయనగర రాజవంశమైన ‘పూసపాటి’ వంశంలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. పైడితల్లి సిరిమానోత్సవం సాక్షిగా ఈ వివాదం రాజుకుంది. సిరిమానోత్సవం సాక్షిగా తమకు అవమానం జరిగిందని ఆనందగజపతిరాజు కుమార్తె ఉర్మిళ వాపోయింది. మమ్మల్ని కోట నుంచి బయటకు పంపమని పోలీస్,దేవాదాయ అధికారులను సంచయిత పురమాయించడం విచారకరం అని ఉర్మిళ ఆరోపించారు.
మాన్సాస్ ట్రస్ట్ తన సొంత సంస్థలా సంచయిత అధికారం చెలాయిస్తున్నారని ఉర్మిళ మండిపడ్డారు. సంచయిత చేష్టలు ఆనందగజపతికి అవమానకరమని వ్యాఖ్యానించారు. కోట బురుజులపై నుంచి సిరిమానోత్సవం తిలకించడం తమ వారసత్వ హక్కు అని అన్నారు.
అశోక్ గజపతిరాజును కలిసి సహకరించాలని కోరినా స్పందించలేదని ఉర్మిళా అన్నారు. ట్రస్ట్ బోర్డు మెంబర్ గా కూడా ప్రమాణ స్వీకారం జరగనివ్వడం లేదని.. తమకు జరుగుతున్న అన్యాయంపై మాత్రమే ప్రశ్నిస్తున్నామని.. రాజకీయాలు లేవు అని అన్నారు.
మాన్సాస్ పై చట్టప్రకారమే ముందుకు వెళ్తామని.. న్యాయస్థానాలపై తమకు గౌరవం ఉందని ఉర్మిళ అన్నారు. మాన్సాస్ లో జరుగుతున్న పరిణామాలపై న్యాయపోరాటం చేస్తామన్నారు.