ఆ దేశ ప్రధాని మోడీకి పెద్ద ఫ్యాన్ అట!

Update: 2020-01-15 05:38 GMT
ఒక దేశ ప్రధానిని మరో దేశ ప్రధాని పొగడటం మామూలే. కానీ.. తన ఆరాధ్య నేతగా అభివర్ణించటం లాంటి కీలక వ్యాఖ్యల్ని చేయటానికి కాస్త సంకోచిస్తారు. అందుకు భిన్నమైన సీన్ ఒకటి తాజాగా చోటు చేసుకుంది. ఒక అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న డెన్మార్క్ ప్రధానమంత్రి అండర్స్ రాస్ముసెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీని ఆకాశానికి ఎత్తేశారు.

అంతేనా.. మోడీని తన ఆరాధ్య నేతగా అభివర్ణించటమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా నియంత పాలకులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య దేశాలు ఒక అంతర్జాతీయ కూటమి కట్టాలని.. దానికి భారత్ కీలక పాత్ర పోషించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.

రైజినా డైలాగ్ పేరుతో అంతర్జాతీయ సదస్సును భారత్ నిర్వహిస్తోంది. దీనికి పలువురు విదేశీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా డెన్మార్క్ ప్రధాని తన ప్రసంగంలో నరేంద్ర మోడీపై ప్రశంసల జల్లులు కురిపించారు. అంతర్జాతీయంగా ప్రజాస్వామ్య దేశాలతో కూటమి కట్టి దానికి భారత్ నాయకత్వం వహించాలన్న ఆయన.. తనకు మోడీ అంటే చాలా అభిమానమని వ్యాఖ్యానించటం విశేషం.
Tags:    

Similar News