కాల్‌ తో రూ.80 వేలు స్వాహా..అవాక్కైన యువ‌కుడు

Update: 2020-05-08 11:10 GMT
క‌రోనా క‌ట్ట‌డి కోసం విధించిన లాక్‌ డౌన్‌ తో ప్ర‌జ‌లంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఇళ్ల‌ల్లో కూర్చుని సోష‌ల్ మీడియాతో కాల‌క్షేపం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో కొంద‌రు పోర్న్ వెబ్‌ సైట్‌ లు చూసే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ విధంగానే ఓ యువ‌కుడు పోర్న్ వెబ్‌ సైట్ చూస్తుండ‌గా.. అక్క‌డ ఓ యాడ్ క‌నిపించింది. ఆన్‌ లైన్‌ లో అమ్మాయిలు కావాల్న‌? అని అడుగుతూ ఓ నంబ‌ర్ క‌నిపించింది. ఎంతో ఆస‌క్తితో ఆ నంబ‌ర్‌కు ఫోన్ చేయ‌గా ఓ యువ‌తి ఎత్తింది. చివ‌ర‌కు ఆ అమ్మాయి ద్వారా రూ.80 వేల మేర న‌ష్ట‌పోయి పోలీసుల‌ను ఆశ్ర‌యించిన సంఘ‌ట‌న హైద‌రాబాద్‌ లో జ‌రిగింది.

హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్ లాక్‌ డౌన్‌ కారణంగా రూమ్‌ కే ప‌రిమిత‌మ‌య్యాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో విధులు నిర్వ‌హిస్తున్నాడు. ఒంట‌రిగి ఉండ‌డంతో ఖాళీ సమయంలో పోర్న్ వీడియోలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ వెబ్‌ సైట్లో ఒక ఫోన్ నంబర్ కనిపించగా ఫోన్ చేశాడు. అందమైన అమ్మాయిలతో సె* చాటింగ్‌ - వీడియో కాలింగ్‌ - న్యూడ్ ఫొటోల కోసం ఫోన్ చేయాల‌ని ఉండ‌డంతో సంప్ర‌దించాడు. అవతలి వైపు ఫోన్ ఎత్తిన యువతి కైపు ఎక్కించేలా మాట్లాడింది. డ‌బ్బులు పంపిస్తే న‌గ్న ఫొటోలు పంపుతాన‌ని చెప్పింది. దీంతో ఆ యువ‌కుడు ఆమెకు కొంత న‌గ‌దు పంపించ‌డంతో ఆమె వివ‌స్త్ర‌గా ఉన్న ఫొటోలు పంపించింది. ఆమె అందానికి ముగ్ధుడైపోయాడు. వీడియో కాల్‌ లో మాట్లాడాల‌ని యువ‌కుడు కోర‌గా ఆమె అంగీక‌రించింది. దీనికి కూడా కొంత చెల్లించుకున్నాడు. ఇక వారిద్దరూ ఒక్క దారం పోగు కూడా లేకుండా ఇద్ద‌రు న‌గ్నంగా వీడియో కాలింగ్‌ లో మాట్లాడుకున్నారు. ప‌లుసార్లు ఇద్దరూ ఆ విధంగా వీడియో కాల్‌ లో మాట్లాడుకున్నారు. దీంతో సంతోషంలో మునిగాడు.

అయితే కొద్దిరోజులకు అత‌డి మెయిల్‌కు ఓ సందేశం వచ్చింది. అతడు న‌గ్నంగా ఆమె‌తో వీడియో కాల్ మాట్లాడిన వీడియో వ‌చ్చింది. దీంతో షాక్‌ కు గురైన యువ‌కుడు మొత్తం చ‌దివాడు. అందులో తాము అడిగినంత డబ్బులు ఇవ్వాల‌ని, లేకపోతే ఆ వీడియో సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించారు. కంగారుపడిన ఆ యువ‌కుడు వారికి రూ.20 వేలు ఇచ్చాడు. ఇలా ప‌లుమార్లు చెల్లించాడు. మొత్తం రూ.80 వేలు వారికి ఇచ్చాడు. ఇంత చెల్లించినా కూడా వారు డబ్బు అడుగుతూనే ఉండ‌డంతో వారి మెసేజ్‌ ల‌కు స్పందించ‌డం లేదు. ఇది గ‌మ‌నించిన అవ‌తలి వారు అత‌డి న్యూడ్ ఫొటోలను ఆ యువ‌కుడి ఫేస్‌బుక్ అకౌంట్‌ కు ట్యాగ్ చేసి పోస్ట్ చేశారు. దీంతో ఆ యువ‌కుడు షాక్‌ కు గుర‌య్యాడు. ఏం చేయాలో తెలియ‌క చివ‌ర‌కు ఆ యువ‌కుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్ర‌యించాడు. అత‌డి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఆన్‌ లైన్‌ లో అలాంటి విష‌యాల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పోలీసులు సూచిస్తున్నారు. బెదిరింపు మెయిల్స్ వ‌స్తే త‌మ‌కు ఫిర్యాదు చేయాల‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News