లోతుగా చేస్తే ఇంకెంత మంది దొరుకుతారో..?

Update: 2015-10-05 08:58 GMT
ఇటీవల హైదరాబాద్ మహానగరంలో చెయిన్ స్నాచింగ్ ఘటనలు జోరు పెరిగాయి. ద్విచక్ర వాహనాల మీద వస్తున్న వారు రెప్పపాటులో చెయిన్లు దొంగతనం చేస్తూ చెలరేగిపోతున్నారు. ఇలాంటి వారికి సంబంధించిన సమాచారం సేకరించటంతో పాటు.. ఇతర నేరాలకు సంబంధించి మహానగరంలో అప్పుడప్పడు ఆకస్మిక తనిఖీలు.. కార్బన్ సెర్చ్ నిర్వహించటం తెలిసిందే.

తాజాగా హైదరాబాద్ పాతబస్తీలో యాభై మంది పోలీసు బలగాలతో భారీ ఎత్తున నిర్బంద తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున అనుమానితులు పోలీసుల చేతికి చిక్కటం గమనార్హం. వీరిలో నేరస్తులు ఎవరు? ఏమిటన్న విషయాలు తేలాల్సి ఉంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న అనుమానితుల సంఖ్య 160 ఉండటం చూస్తే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందన్న విషయం అర్థమవుతుంది.

అనుమానితుల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఉండటం గమనార్హం. పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనాలతో పాటు.. ఆటోలు.. కార్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెబుత్నారు.

యాభై మంది పరిమిత పోలీసు బలగాలతో చేసిన తనిఖీలకే ఈ స్థాయి ఫలితం ఉంటే.. భారీ ఎత్తున ఒకేసారి జల్లెడ పడితే మరెంత మంది బయటకు వస్తారన్నది ఒక సందేహమైతే.. పాతబస్తీలోని కొన్ని ప్రాంతాలతో పాటు హైదరాబాద్ మహానగరంలో కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా పోలీసులు కానీ భారీ తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. మరి.. ఈ విషయంలో తెలంగాణ పోలీసులు ఉన్నతాధికారులు ఏం చేస్తారో..?
Tags:    

Similar News