హైదరాబాద్ లో మిలియనీర్లు 510 మందేనా?
సంపన్నులు ఉన్న నగరాల జాబితాలో హైదరాబాద్ కు చోటు దక్కింది. హైదరాబాద్ నగరంలో 510 మంది మిలియనీర్లు ఉన్నట్లు తాజా అధ్యయనమొకటి వెల్లడించింది. ఆసియా - పసిఫిక్ దేశాల్లో అత్యధిక ధనవంతులు ఉన్న నగరాల జాబితాను తాజాగా రిలీజ్ చేశారు. అందులో ఢిల్లీ, ముంబయిలు టాప్ 20లో చోటు దక్కించుకున్నాయి. 2016 వెల్త్ రిపోర్ట్ పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో ముంబయికి 12వ స్థానం దక్కింది. ముబయిలో 41,200 మంది సంపన్నులు ఉన్నారట. ఢిల్లీలో 20600 మంది సంపన్నులు ఉన్నారట. ఢిల్లీకి 20వ ప్లేస్ దక్కింది.
కాగా ఈ జాబితాలో జపాన్ రాజధాని టోక్యో ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. టోక్యోలో ఏకంగా 2.64 లక్షల మంది మిలియనీర్లు ఉన్నారట. ఈ జాబితాలో హైదరాబాద్ పేరు కూడా ఉంది. హైదరాబాద్ లో 510 మంది మిలియనీర్లు ఉన్నారని తేల్చారు.
అయితే... ఇండియాలోని సిటీల లెక్కలన్నీ ఆదాయపన్ను రిటర్నుల ఆధారంగా లెక్కించినట్లుగా కనిపిస్తోంది. లేదంటే ఇంత తక్కువ సంఖ్యలో మిలియనీర్లు ఉన్నారంటే ఇండియన్లే ఆశ్చర్యపోతున్నారు.