• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కిషన్ రెడ్డి లక్ ఇలా ఉంది

కిషన్ రెడ్డి లక్ ఇలా ఉంది

By - Tupaki Desk
Update: 2019-05-31 12:00 GMT
నువ్వు ఎన్ని గోల్స్ పెట్టుకుని అయినా ముందుకెళ్లు ... ప్రపంచం నీకు కొత్త దారులు చూపిస్తూనే ఉంటుంది. ఎన్నో ఆశ్చర్యాలను కలిగిస్తూ ఉంటుంది. లేకపోతే... ఒక ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి పోయి హోం శాఖ (సహాయమే కావచ్చ) మంత్రి కావడం ఏమిటి? ఇదంతా ఒక ఎత్తు అయితే... కిషన్ రెడ్డికి ఒక అదనపు అదృష్టం కూడా దక్కింది. ఈరోజుల్లో బీజేపీకి మోడీ ఎంతో... మోడీకి అమిత్ షా అంత. అమిత్ షా ఎలాంటి వాడన్న వాదన పక్కన పెడితే పార్టీలో ఎంత పవర్ ఫుల్ అన్నది ఇంపార్టెంట్. అమిత్ షా తలచుకుంటే పార్టీలో జరగనిది ఏముంది. అలాంటి వ్యక్తి శాఖలో పడ్డారు కిషన్ రెడ్డి.

తెలంగాణలో బీజేపీ బలంగా ఉన్నది హైదరాబాదులో. తెలంగాణలో కిషన్ రెడ్డి 40 సంవత్సరాలుగా బీజేపీలోనే కొనసాగుతుంది. జస్ట్ ఏడాది క్రితం వరకు తిరుగులేని శక్తిగా మారిన కేసీఆర్ సర్కారుకు పిపీలకంలా కనిపించిన కిషన్ రెడ్డి విశ్వరూపం చూస్తున్నారు కేసీఆర్. ఆడెవడు, ఈడెవడు అన్న సందే... కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా గౌరవించాల్సిన హోదా పొందారు. అంటే తిట్టిచ్చుకున్న చోటే ముద్దు పెట్టించుకున్నాడు. అదే సమయంలో ఇప్పటికే కిషన్ రెడ్డి బీజేపీకి తెలంగాణలో పర్యాయపదంగా మారిన నేపథ్యంలో కీలకమైన హోంశాఖలో పడటంతో పార్టీపై మరింత పట్టురానుంది. భవిష్యత్తులో బీజేపీ ఆడే గేములో రాష్ట్రంలో చక్రం తిప్పడానికి కిషన్ రెడ్డికి ఇది అద్భుతమైన అవకాశం. బీజేపీ కార్యకర్తలంతా ‘కిషనన్నా’అని ఆప్యాయంగా పిలుచుకునే ఆయనకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా అవకాశం లభించడం ఒకరకంగా అసద్ సోదరులకు కూడా ఝలక్ అని చెప్పాలి. గుజరాత్ అల్లర్లకు కారకుడు అమిత్ షాయే అన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆయన చేతిలో హోంశాఖ పడటం, దాని సహాయమంత్రిగా అగ్రెసివ్ పొలిటీషియన్ కిషన్ రెడ్డి కావడం సాధారణ విషయం ఏమీ కాదు. ఏమైనా అసద్ సోదరులు ఒకింత జాగ్రత్త పడాల్సిన రోజులు వచ్చేశాయి.

ఇదిలా ఉండగా... కిషన్ రెడ్డికి హోం శాఖ సహాయమంత్రి పదవి ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో ముందే ప్రచారం జరగడంతో అసలు ఈ లీకు ఎక్కడిది అని పార్టీ ఆరాతీసిందట. అయితే.... జస్ట్ కొన్ని గంటల ముందే కావడంతో అది రచ్చకాలేదు. లేకపోతే చేతికి వచ్చిన కూడా నోటికి అందకుండా పోయేది. కిషన్ రెడ్డి... ఒకప్పుడు ప్రధాని నరేంద్ర మోదీతో చాలా దగ్గరగా మెలిగాడని తెలుస్తోంది. గతంలో బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి పనిచేశారు. అపుడు మోడీని కిషన్ పలుమార్లు కలిశారు. కిషన్ రెడ్డి యాక్టివ్ నెస్ ని మోడీ బాగా ఇష్టపడేవారట. తదనంతర కాలంలో బీజేపీ జాతీయ నేతల పర్యటనల్లో మోడీతో కిషన్ రెడ్డి రూమ్ షేర్ చేసుకున్నారట. దాంతో అప్పటి నుంచే మోడీ మనసులో ఉన్నారు కిషన్ రెడ్డి. ఇపుడు కనుకు నిరూపించుకుంటే భవిష్యత్తులో కిషన్  రెడ్డి తెలంగాణలో భారీ అదృష్టాన్ని దక్కించుకునే అవకాశాలు లేకపోలేదు.

    

Tags:    
  • Kishan Reddy 
  • Narendra Modi 
  • Modi Cabinet 
  • Latest news 

Similar News

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

Copyright @2026

Powered by Blink CMS