అర్నాబ్ గోస్వామి తొలి రోజు జైలు జీవితం ఎలా గడిచిందంటే?

Update: 2020-11-06 03:30 GMT
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామికి జైల్లో తొలి రోజు చుక్కలు కనిపించినట్టు తెలిసింది. ముంబైకి చెందిన ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్ ఆత్మహత్య కేసులో అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీని విధించారు.

ప్రధాన జైలుకు పంపేముందుకు ముందు జాగ్రత్తగా ఆయనను 14 రోజుల పాటు కరోనా క్వారంటైన్ చేశారు. ఇందులో భాగంగానే అర్నాబ్ ను తాత్కాలిక జైల్లో ఉంచారు. అలీబాగ్ జైలులో మొత్తం సామర్థ్యం 82మందికి గాను.. ప్రస్తుతం అక్కడ 99 మంది ఖైదీలున్నారు. ప్రస్తుతం అలీబాగ్ లోని ఓ పాఠశాలలో అర్నాబ్ ను ఉంచారు. దీన్ని తాత్కాలిక జైలుగా పోలీసులు ఉపయోగిస్తున్నారు.

మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జైళ్లలో వైరస్ తీవ్రత పెరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వైద్యపరీక్షల అనంతరం అర్నాబ్ ను క్వారంటైన్ చేశారు. తొలి రోజు ఆయన నిద్రపోలేదని.. అర్ధరాత్రి అయిన తర్వాత కాస్త కునుకు తీశాడని జైలు అధికారులు తెలిపారు.

అర్నాబ్ అరెస్ట్ సందర్భంగా పోలీసులు దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలోనే 13 నిమిషాల వీడియోను పోలీసులు విడుదల చేశారు. ఆయనను సహకరించాలని పలుమార్లు కోరారు. కానీ అర్నాబ్ మాత్రం వినకుండా దబాయించినట్టు వీడియోలో ఉంది. దీన్ని కోర్టు పరిగణలోకి తీసుకొని కస్టడీ విధించింది.

కాగా అర్నాబ్ తనపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా గురువారం బాంబే హైకోర్టును కోరనున్నారు. అలాగే బెయిల్ పిటీషన్ కు కూడా దరఖాస్తు చేసే అవకాశం ఉందని సమాచారం.
Tags:    

Similar News