జగన్ అనే నేను.. హైలెట్స్ ఇవే..
వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పదేళ్ల కలను నెరవేర్చుకున్నారు. ‘వైఎస్ జగన్ అనే నేను’ గద్గద.. ఆనంద స్వరంతో గొంతెత్తి ప్రమాణం చేశారు. వైఎస్ జగన్ అనే నేను అనగానే ప్రమాణ స్వీకార వేదిక అరుపులతో ఊగిపోయింది. ఈ మాట కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న జగన్ కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. కొద్దిసేపు అలానే జనసందోహాన్ని చూస్తూ ఉండిపోయారు..
ముఖ్యమంత్రి జగన్ చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు.. ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులకు తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు డీఎంకే అధినేత స్టాలిన్ లు హాజరయ్యారు..
*ప్రధాన హైలెట్స్ ఇవే..
*మధ్యాహ్నం 12 గంటలకు జగన్ తన తాడేపల్లి ఇంటి నుంచి ప్రమాణ స్వీకార వేదికకు బయలు దేరారు. ఆయన వెనుకాలే వైఎస్ విజయమ్మ వచ్చింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు వెనుక కార్లలో వేదికకు వచ్చేశారు.
*జగన్ ఇందిరాగాంధీ స్టేడియంలోకి రాగానే పూలవర్షం కురిపించారు. సొంతంగా హెలిక్యాప్టర్ సమకూర్చిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. జగన్ పై, ప్రజలపై పూలవర్షం కురిపించారు.
*అందరికీ నమస్కరిస్తూ జగన్ వేదికపైకి వచ్చాడు. అంతకు కొద్ది సేపటి ముందు కేసీఆర్, స్టాలిన్ లు వేదికమీదకు వచ్చారు.
*జగన్ వేదికపైకి రాగానే ప్రజలకు కేసీఆర్, స్టాలిన్ లకు కృతజ్ఞతలు తెలుపుతూ అభివాదం చేశారు.
* ఆ తర్వాత గవర్నర్ నరసింహన్ వచ్చారు. జాతీయ గీతం ఆలపించాక ప్రమాణ స్వీకారం జరిగింది. జగన్ చేత సీఎంగా నరసింహన్ ప్రమాణం చేశారు..
*ఆ తర్వాత గవర్నర్ కేసీఆర్, స్టాలిన్ లను, జగన్ ఫ్యామిలీకి శుభాకాంక్షలు తెలిపి వెళ్లిపోయారు..
*గవర్నర్ వెళ్లాక స్టాలిన్ మొదట మాట్లాడారు. రెండే ముక్కల్లో జగన్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆ తర్వాత కేసీఆర్ క్లుప్తంగా మాట్లాడారు. తెలుగు వారు కలిసి ఉంటే కలదు సుఖమని.. గోదావరి, కృష్ణా నీళ్లను వాడుకొని రెండు రాష్ట్రాలు సౌభాగ్యంగా ఉండాలని కోరారు. చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన జగన్.. పెద్ద బాధ్యతను సమర్థంగా నిర్వహించాలని కోరారు.
*కేసీఆర్ తర్వాత వైఎస్ జగన్ మాట్లాడారు.