కరోనా చేసిన మేలు: ఆస్పత్రులన్నీ ఖాళీ.. ఎందుకంటే..?
ప్రస్తుతం ఆస్పత్రుల్లో చిన్నచిన్న వ్యాధులకు మాత్రమే చికిత్స అందుతోంది. ప్రాణాంతక వ్యాధుల కేసులు ఇప్పుడు ఆస్పత్రులకు చాలా తగ్గాయి. ఎప్పుడు అత్యావసర వార్డు కిటకిటలాడుతుండగా ఇప్పుడు వెలవెలబోతున్నాయి. అదంతా కరోనా మహమ్మారి చేసిన పుణ్యమే. ఎందుకంటే ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు లేవు... నేరాలు జరగడం లేవు. ముఖ్యంగా గుండె సంబంధిత, క్యాన్సర్ రోగులు లేరు. ఇదంతా కరోనా మహిమ. కరోనా కట్టడిలో భాగంగా ప్రపంచంలోని చాలా దేశాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రజలు నిండు ఆరోగ్యంతో ఉంటున్నారు. దీంతో ఆస్పత్రుల్లో రోగులు లేక బెడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ వార్డులు ఖాళీగా ఉంటున్నాయి. సాధారణ పరిస్థితుల్లో హృద్రోగులు, క్యాన్సర్ రోగులు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారితో భయానకంగా ఉండేవి. కరోనా పెరుగుతుండగా మిగతా వ్యాధుల కేసులు తీవ్రంగా తగ్గుముఖం పట్టాయి. మూడోవంతు నుంచి సగం వరకు ఆస్పత్రులకు కేసులు తగ్గాయని వైద్యారోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ప్రాణాంతాక వ్యాధులు కూడా కానరావడం లేదు. ఎందుకంటే ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఎలాంటి ఒత్తిడి, ఆందోళన అనేవి వారిలో లేవు. ఈ నేపథ్యంలో గుండె జబ్బులు లాంటివి ఎందుకు వస్తాయి. కుటుంబంతో హాయిగా ఉంటున్న జీవికి అంత కన్నా కావాల్సినది ఏముంటుంది? వాస్తవంగా పొద్దున నుంచి రాత్రి వరకు ఉరుకుల పరుగుల జీవితం ఉండేది. ఈ క్రమంలో ఇంటి.. ఆఫీస్ బాధలన్నీ కలిపి గుండెపై.. మెదడుపై తీవ్ర భారం మోపేవి. ప్రస్తుతం ఇంటికే పరిమితమవడంతో ఎలాంటి బాధలు లేవు. ఇక చిన్న నొప్పి కలిగిన ఆస్పత్రికి పరుగెత్తుకొచ్చే వారు తగ్గారు.
ఈ క్రమంలో గుండె, క్యాన్సర్, కిడ్నీ, లివర్, లంగ్స్ సహా 825 రకాల చికిత్సలకు సంబంధించిన కేసుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా భారీగా తగ్గిపోయాయి. దేశంలో 20 శాతానికి తగ్గాయని నేషనల్ హెల్త్ అథారిటీ వివరాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఆస్పత్రులకు గణనీయంగా కేసులు తగ్గిపోవడంతో ఆస్పత్రి సిబ్బంది ఈగలు, దోమలు కొట్టుకుంటూ కూర్చుంటున్న పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ కేసులు తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో కొన్ని ఇవే... గుండె జబ్బులను పెంచే పర్యావరణ కాలుష్యం పూర్తిగా తగ్గిపోయింది. ఇళ్ల నుంచి పని చేసే సౌకర్యం లభించడంతో వృత్తి, ఉద్యోగపరమైన ఒత్తిళ్లు తగ్గిపోయాయి. గుండె జబ్బులు కలిగిన వారిలో 50 శాతం మందికి ఉద్యోగపరమైన ఒత్తిళ్లతోనే బాధపడుతుండేవారు.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ప్రయాణాలు పూర్తిగా తగ్గిపోయాయి. సమయానికి తిండి, నిద్ర ఉంటున్నాయి. ధూమ, మద్యపానం అందుబాటులో లేదు. స్వల్ప అనారోగ్యాన్ని పట్టించుకోవడం లేదు. వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో రోడ్డు ప్రమాదాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఈ విధంగా కరోనా వైరస్ పుణ్యమా అని విధించిన లాక్‌డౌన్ మానవ సమాజానికి మేలు చేస్తూనే ఉంది.