ట్రంప్ నిర్ణయంపై కోర్టుకెక్కిన హార్వర్డ్ - ఎంఐటీ
కరోనా కాలంలో అమెరికా విశ్వవిద్యాలయాలన్నీ నేరుగా క్లాసులు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. దీన్ని అడ్వంటేజ్ గా తీసుకున్న ట్రంప్ సర్కార్ ఆన్ లైన్ విధానంలో అమెరికాలో విద్యను అభ్యసించాలనుకుంటున్న విదేశీ విద్యార్థులందరూ దేశం విడిచి వెళ్లాంటూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నిర్ణయంపై అమెరికా విశ్వవిద్యాలయాల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది.
తాజాగా ఈ నిర్ణయాన్ని ప్రకటించిన అమెరికా ఇమిగ్రేషన్ ఏజెన్సీ, హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగంపై హార్వర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) బుధవారం బోస్టన్ డిస్ట్రిక్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశాయి.
విదేశీ విద్యార్థులను బలవంతంగా దేశం విడిచి వెళ్లగొట్టే ప్రయత్నాలను అడ్డుకోవాలని ఈ రెండు వర్సిటీలు కోర్టును కోరాయి.
మరో వైపు స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ మార్క్ టెస్సియర్ లావిగ్నే కూడా ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఈ నిర్ణయం విదేశీ విద్యార్థులను అనిశ్చితిలోకి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.