ట్రంప్ ట్విట్టర్ పాస్ వర్డ్ బయట పెట్టిన హ్యాకర్ ..పాస్ వర్డ్ ఏమిటంటే ?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కి గురైన సంగతి తెలిసిందే. అమెరికా లో అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కి గురైంది. ఈ ఏడాది అక్టోబర్ 16వ తేదీన ఈ ఘటన జరిగింది. ఆ అకౌంట్ పాస్వర్డ్ కూడా బయటపెట్టాడు. ఇకపోతే , ఇటీవలే హ్యాకర్‌ను గుర్తించారు అమెరికా అధికారులు. అతని కేసు నమోదు చేశారు. అతణ్ని నెదర్లాండ్ పౌరుడిగా గుర్తించారు.
ఆ హ్యాకర్ పేరు విక్టర్ గెవెర్స్. ఈ ఏడాది అక్టోబర్ 16వ తేదీన అతను ట్రంప్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ పాస్ వర్డ్ ను గుర్తించాడు. "maga2020!" పదాన్ని ట్రంప్ అప్పట్లో తన ట్విట్టర్ అకౌంట్ పాస్వర్డ్ గా వినియోగించారు. అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఎన్నికల స్లోగన్.. మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఇందులోని ఒక్కో పదానికి చెందిన తొలి అక్షరాన్ని వినియోగించి డొనాల్డ్ ట్రంప్ తన ట్విట్టర్ అకౌంట్ పాస్ వర్డ్ గా వినియోగించారు. ఇకపోతే ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌కు గురైనట్లు అప్పట్లో వార్తలు వచ్చినప్పటికీ.. వైైట్‌హౌస్ దాన్ని తోసిపుచ్చింది. అకౌంట్ హ్యాక్ కాలేదని, సాంకేతిక ఇబ్బందులు ఏర్పడినట్లు వివరణ ఇచ్చింది. అప్పట్లో వెలువడిన ఈ ప్రకటన తప్పు అని తేలింది.
తాజాగా విక్టర్ గెవెర్స్ ను నెదర్లాండ్ ప్రభుత్వం న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టింది. విచారణ సందర్భంగా అతను.. ఎథికల్ హ్యాకర్ గా గుర్తించింది. దీనితో అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జరిమానాలను విధించలేదు. ఎథికల్ హ్యాకర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని నెదర్లాండ్ చట్టాలు చెబుతున్నాయి. హ్యాకర్లను శిక్షించడానికి కఠిన చట్టాలు ఉన్నప్పటికీ.. ప్రత్యేక సందర్భాల్లో మినహాయింపునిచ్చారు. ఎథికల్ హ్యాకర్లపై చర్యలు తీసుకునే నిబంధనలు లేవు. అమెరికా అధ్యక్షుడి ట్విట్టర్ అకౌంట్ సెక్యూరిటీ వ్యవస్థ బలహీనమైనదని వెల్లడించడానికే తాను హ్యాక్ కు పాల్పడినట్లు విక్టర్ చెప్పాడు. ట్విట్టర్ అకౌంట్ పాస్ వర్డ్ ను తెలుసుకోవడంలో నాలుగుసార్లు విఫలం అయ్యాయనని, అయిదో ప్రయత్నంలో తెలుసుకోగలిగానని స్థానిక మీడియాకు అతను వివరించాడు.