టీ కాంగ్రెస్ లో మరో బిగ్ వికెట్ డౌన్ ...త్వరలో బీజేపీ లోకి !

Update: 2020-12-07 09:47 GMT
తెలంగాణ కాంగ్రెస్‌ కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. జీహెచ్ ఎంసి ఎన్నికల్లో అత్యంత దారుణంగా పరాజయంపాలు కావడం ఆ పార్టీని పీడకలలా వెంటాడుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో కనీస పోటీని ఇవ్వలేక చేతులెత్తేసింది. దీనితో పలువురు నేతలు పడాల్సి వచ్చిన పరిస్థితులు రాజీనామాలకు దారి తీస్తున్నాయి. ఒక్కొకరుగా పార్టీని వీడుతున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలు కావడానికి తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నైతిక బాధ్యత వహించారు. తన పదవికి రాజీనామా చేశారు. తన పదవికి రాజీనామా చేసిన కొద్దిరోజులకే, మరో కీలక నేత గుడ్‌ బై చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ కోశాధికారి గూడూర్ నారాయణ రెడ్డి రాజీనామా చేశారు. పార్టీ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. పార్టీలోని అన్ని పదవులకూ రాజీనామా చేశారాయన.

పీసీసీ కోశాధికారి పదవితో పాటు అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి, తన ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపించారు. పార్టీ అధిష్ఠానం తనపై విశ్వాసం ఉంచి అనేక బాధ్యతలు, పదవులను అప్పగించిందని, వాటిని తాను వందశాతం నిర్వర్తించానని వివరించారు. ప్రతి స్థాయిలోనూ అధిష్ఠానం తన కష్టాన్ని గుర్తించిందని, అందుకే పీసీసీ కోశాధికారి పదవి స్థాయికి ఎదిగానని ఆయన చెప్పుకొచ్చారు. తనకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సోనియాగాంధీకి కృతజ్ఙతలు తెలిపారు.త్వరలోనే నారాయణరెడ్డి బీజేపీలో చేరనున్నారు. గతంలోనే నారాయణరెడ్డి కాంగ్రెస్‌ను వీడతారనే ప్రచారం కూడా జరిగింది. మరోవైపు విజయశాంతి కూడా కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈ రోజు రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె బీజేపీలో చేరబోతున్నారు.
Tags:    

Similar News