కరోనా వేళ.. జీఎస్టీ వసూళ్లు అదరగొట్టేస్తున్నారుగా?
ఓవైపు కరోనా. మరోవైపు పడుకున్న ఆర్థిక వ్యవస్థ. ఇలాంటి వేళ.. పన్ను రాబడుల మీద ఆశలు.. అంచనాలు పెట్టుకొని పాలనా రథాన్ని లాగుతున్న ప్రభుత్వాధినేతలు.. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాయి. ఇలాంటివేళ.. పండుగల నెలగా చెప్పే అక్టోబరు కలిసి వచ్చింది. కొత్త ఆశల్ని తీసుకొచ్చిందని చెప్పాలి. కరోనా కేసులు ఒక కొలిక్కి వచ్చినప్పటికీ.. ఇప్పటికే కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనాకు ముందు లాంటి వాతావరణం ఇంకా రాకున్నా.. పన్ను ఆదాయం విషయంలో తాజాగా వచ్చిన వసూళ్లు కాస్తంత ఉపశమనాన్ని కలిగించేలా ఉన్నాయి.
ఏప్రిల్ తో మొదలైన 2020-2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు పన్ను ఆదాయాలు సరిగా వచ్చింది లేదు. ఏప్రిల్ నాటికి లాక్ డౌన్ దేశ వ్యాప్తంగా అమలు చేయటంతో ప్రభుత్వ పన్ను ఆదాయానికి భారీ గండి పడింది. ఇదే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికేసీఆర్ పలు సందర్భాల్లో ప్రస్తావించారు కూడా. వందల కోట్లలో వచ్చే ఆదాయం పదుల కోట్లలో కూడా రావటం లేదన్న మాట ఆయన చెప్పేవారు.
అందుకు భిన్నంగా ఈ ఆర్థిక సంవత్సరం మొదలైన తర్వాత తొలిసారి జీఎస్టీ రూపంలో ఒక నెల ఆదాయం రూ.లక్ష కోట్లను దాటిన మొదటి నెలుగా అక్టోబరును చెప్పాలి. గత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ - సెప్టెంబరు మధ్య జీఎస్టీ ఆదాయం రూ.7.01లక్షల కోట్లు ఉంటే.. ఈసారి కేవలం రూ.5.59లక్షల కోట్లకే పరిమితమైన పరిస్థితి. రెండు నెలల క్రితంతో పోలిస్తే ఉన్న ఆదాయ లోటు.. తాజాగా తగ్గటం శుభ పరిణామంగా చెప్పాలి.
అన్నింటికి మించి అక్టోబరులో జీఎస్టీ ఆదాయం తెలుగు రాస్ట్రాల్లో గత ఏడాది కంటే ఎక్కువగా ఉండటం ఆసక్తికర పరిణామంగా చెప్పాలి. 2019 అక్టోబరు నెలలో ఏపీ జీఎస్టీ ఆదాయం రూ.1975 కోట్లు అయితే.. ఈసారి మాత్రం ఏకంగా 26శాతం అధికంగా రూ.2480 కోట్లకు పెరిగింది. అదే సమయంలో తెలంగాణలో గత అక్టోబరులో రూ.3230 కోట్లుగా ఉన్న జీఎస్టీ ఆదాయం ఈసారి మాత్రం రూ.3383 కోట్లు మాత్రమే వచ్చింది. జీఎస్టీ ఆదాయం పెరుగుదల ఏపీలో 26 శాతం ఉంటే.. తెలంగాణలో 5 శాతానికే పరిమితం కావటం గమనార్హం. కరోనా నేపథ్యంలో తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్ లో లక్షలాది మంది తమ స్వగ్రామాలకు.. ఊళ్లకు వెళ్లిపోవటం కూడా జీఎస్టీ ఆదాయం మీద ప్రభావితం చూపిందని చెప్పకతప్పదు.