ఏపీ బడ్జెట్ రూ.2లక్షల కోట్లా?
ఓపక్క బీద అరుపులు.. మరోపక్క భారీ అంకెలు. జీతాలు కూడా ఇచ్చుకోలేని దీనస్థితిలో రాష్ట్రం ఉందని చెబుతున్న వేళ.. ఏపీ రాష్ట్ర బడ్జెట్ ను రూ.2లక్షల కోట్లకు ప్రవేశ పెట్టటం దేనికి సంకేతం? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఏడాదికి ఏడాది అంతకంతకూ బడ్జెట్ ను పెంచేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఈసారి ఏకంగా రూ.2లక్షల కోట్లకు బడ్జెట్ ను ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
విభజన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బాబు సర్కారు తన తొలి బడ్జెట్ (2014-15)ను రూ.1.11 లక్షల కోట్లకు ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచి ఏడాదికేడాది అంతకంతకూ బడ్జెట్ ప్రతిపాదనల్ని పెంచేస్తున్న పరిస్థితి. సార్వత్రిక ఎన్నికల ముందు ప్రవేశ పెట్టే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కావటంతో భారీ ప్రతిపాదనల్ని తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు.
సంక్షేమ పథకాలతో పాటు.. సాగునీటి ప్రాజెక్టులకు భారీ కేటాయింపులు.. ఉపాధికి.. పింఛన్లకు భారీ మొత్తంలో ప్రతిపాదనల్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. శాఖల వారీగా చూస్తే.. రాష్ట్రంలోని 13 జిల్లాలకు జిల్లాల వారీగా అధిక ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఉన్న 28 ప్రాజెక్టులకు తోడుగా మరో 22 ప్రాజెక్టులను ఎంచుకొని వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో బాబు ఉన్నట్లు చెబుతున్నారు. దాదాపు రూ.20వేల కోట్ల విలువైన కొత్త పనుల్ని మార్చినెలాఖరు నాటికి టెండర్లు పిలిచి పనులు అప్పగిస్తారని చెబుతున్నారు. మరింత భారీగా బడ్జెట్ ప్రతిపాదనలు.. కేటాయింపులు చేస్తున్న ఏపీ సర్కారు.. అందుకు సరిపడా ఆదాయాన్ని ఏ విధంగా సమకూర్చుకుంటుందన్నది ప్రశ్నగా మారింది. రూ.2లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టిన రాష్ట్రానికి కేంద్ర సాయం అవసరమా? అన్న ప్రశ్నకు ఎవరు మాత్రం సమాధానం చెబుతారు? ఇంతకీ.. ఇంత భారీ బడ్జెట్ లో వాస్తవ లెక్కలు ఎంతమేర ఉన్నట్లు? అన్నది సందేహంగా మారింది.