ఈ ప్రపంచంపై కరోనా ఎన్నో విధాలుగా ప్రభావం చూపింది. మరెన్నో మార్పులకు మూలమైంది. ఇలాంటి మార్పుల్లో ప్రధానమైంది వర్క్ ఫ్రమ్ హోమ్. కరోనా కారణంగా ఇళ్ల నుంచి బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో అనివార్యంగా ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయాల్సి వచ్చింది. సంస్థలకు చేయించాల్సి వచ్చింది. ఏ కొద్ది మంది రంగాల విషయంలోనో తప్ప.. మెజారిటీ రంగాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది సక్సెస్ ఫుల్ గానే నడిచింది. ఇంకా.. నడుస్తోంది కూడా.
దీంతో.. ఆఫీసు నిర్వహణ, వ్యయభారాలను లెక్కలోకి తీసుకుంటున్న పలు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ను కంటిన్యూ చేస్తూనే ఉన్నాయి. తొలిదశ లాక్ డౌన్ తర్వాత ఆఫీసులకు వెళ్లినా.. మళ్లీ సెకండ్ రావడంతో మళ్లీ ఇంటి నుంచే పనిచేయాల్సి వచ్చింది. దీంతో.. కంప్లీట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలు కూడా చేస్తున్నాయి పలు కంపెనీలు.
ఈ నేపథ్యంలోనే.. ప్రఖ్యాత గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారికి అందిస్తున్న సాలరీల్లో మార్పులు చేపట్టింది. అంటే.. ఆఫీసుకు వచ్చే వారికి ఒక విధమైన జీతం.. ఇంటి నుంచి పనిచేస్తున్న వారికి మరో వేతనం చెల్లించాలని నిర్ణయించింది. వారు చేస్తున్న పని, నివసిస్తున్న ప్రాంతంలో లివింగ్ ఆఫ్ కాస్ట్ ను పరిగణనలోకి తీసుకొని వేతనాలను లెక్క గట్టాలని నిర్ణయించింది.
ఇందుకోసం సరికొత్త టూల్ ను కూడా తీసుకొచ్చింది. 'వర్క్ లొకేషన్' పేరుతో పిలుస్తున్న ఈ టూల్ ఆధారంగా.. ఈ లెక్కలు వేయనుంది. ఉద్యోగులు ఉంటున్న ప్రాంతాన్ని బట్టి అదనపు చెల్లింపులు ఏమైనా చేయాల్సి వస్తే.. అది కూడా చేస్తుందన్నమాట. ట్రాన్స్ ఫర్ల విషయంలోనూ వెసులుబాటు కల్పించేందుకు యోచిస్తోంది. మొత్తానికి.. ఉద్యోగులు స్వేచ్చగా పనిచేస్తూ.. బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేస్తున్నట్టు గూగుల్ ప్రతినిధులు చెబుతున్నారు.