కరోనా ఎఫెక్ట్ : ఉద్యోగులకి బంపర్ ఆఫర్ ప్రకటించిన టెక్ దిగ్గజాలు !

Update: 2020-03-05 10:32 GMT
కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ నాశనాన్ని శాసిస్తుంది. ప్రపంచంలోని చాలాదేశాలు ఇప్పుడు కరోనా కోరల్లో చిక్కుకొని బయట పడటానికి కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ వైరస్ ప్రభావం భారత్ లో కూడా వేగంగా విస్తరిస్తుంది. ఇక ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావంతో సాఫ్టువేర్ రంగంలోని పలు కంపెనీలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఇప్పటికే వివిధ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌ ను ఆఫర్ చేయగా. తాజాగా టెక్ దిగ్గజాలు అయిన విప్రో, కాగ్నిజెంట్ వంటి సంస్థలు కూడా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌ ఆదేశాలు జారీ చేశాయి.

అలాగే ఈ టెక్ దిగ్గజాలు ..కరోనా వైరస్ పుట్టిన చైనా భూభూగంలోని హాంగ్‌ కాంగ్, మకావ్ తదితర ప్రాంతాలకు వెళ్లవద్దని విప్రో తమ ఉద్యోగులను ఆదేశించింది. దీనిపై మళ్లీ ప్రకటన చేసేవరకు ఈ నియమం అమలులో ఉంటుందని , అలాగే సింగపూర్, సౌత్ కొరియా, జపాన్, ఇటలీ వంటి దేసాలకు కూడా వెళ్లవద్దని విప్రో తెలిపింది. ఒకవేల , తమ కంపెనీ కి చెందిన వారు చైనా వెళ్లాల్సి వస్తే , తిరిగి వచ్చిన తరువాత కొద్ది రోజులు ఇంటి నుండే విధులు నిర్వర్తించి , పూర్తిగా కరోనా వైరస్ లేదు అని నిర్దారించుకున్న తరువాతే ఆఫీస్‌ కు రావాలని తెలిపింది. ఇదే సమయం లో కరోనా వైరస్ పుట్టిన వూహాన్‌ సిటీలో తమకు ఉద్యోగులు ఎవరూ లేరని , అలాగే తమ కార్యాలయాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపింది.

అలాగే , అన్ని చోట్ల స్క్రీన్లను ఏర్పాటు చేశామని సర్జికల్ మాస్క్‌ లను అందరికి అందుబాటులోకి తీసుకొచ్చామని, తరుచూ కార్యాలయాలను క్లీన్ చేస్తున్నామని తెలిపింది. అలాగే ఆఫీస్ కి వచ్చి పనిచేసే ఉద్యోగులుఎం ఆఫీస్ ని శుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని కోరింది. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే ఉద్యోగి వెంటనే ఆసుపత్రులకు వెళ్లాలని తెలిపింది. విప్రో లాగే , మరో టెక్ దిగ్గజం అయిన కాగ్నిజెంట్ కూడా తమ ఉద్యోగులకు ఇటువంటి సూచనలే చేసింది. మొత్తంగా కరోనా వైరస్ ప్రభావం తో టెక్కీలు హాయిగా ఇంట్లోనే కూర్చొని పని చేసుకొనే అవకాశాన్ని టెక్ దిగ్గజాలు కల్పిస్తున్నాయి.


Tags:    

Similar News