టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్

Update: 2020-05-09 03:30 GMT
కరోనా వైరస్ విద్యార్థుల పాలిట వరమైందో శాపమైందో అర్థం కానీ పరిస్థితి. సొంతంగా రాసి ర్యాంకులు పొందితే అదో ఫీల్. కానీ పరీక్షలు రాయకుండానే పాస్ అయిపోయే పరిస్థితిని కరోనా వైరస్ కల్పించింది. మొద్దు స్టూడెంట్స్ అంతా కరోనాకు జేజేలు పలుకుతుండగా.. క్లెవర్ స్టూడెంట్స్ అంతా కరోనాను తిట్టుకుంటున్నారు.

పదోతరగతి పరీక్షలు ఇలా మొదలవగానే అలా కరోనా అటాక్ అయ్యింది. దీంతో వైరస్ సామూహికంగా కలిసిమెలిసి ఉండే విద్యార్థులకు సోకితే డేంజర్ అని రాష్ట్ర ప్రభుత్వాలు పదోతరగతి పరీక్షలు వాయిదా వేశాయి. మొత్తం స్కూళ్లకు సెలవులు ప్రకటించాయి. లాక్డౌన్ తో 45రోజులుగా విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. దీంతో మళ్లీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు? విద్యార్థుల భవితవ్యం ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. తెలుగు రాష్ట్రాలతోపాటు మిగతా రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

ఇప్పటికే కేంద్రం పరిధిలోని సీబీఎస్ఈ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేశాయి. పదోతరగతి పరీక్షలు మాత్రం నిర్వహిస్తామంటున్నాయి.

ఇక తాజాగా ఏకంగా 10వ తరగతి విద్యార్థులను కూడా పరీక్షలు లేకుండా ప్రమోట్ చేస్తున్నట్లు పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ ప్రకటించారు. ప్రీబోర్డు పరీక్షా ఫలితాల ఆధారంగా 10వ తరగతి విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేస్తామని పంజాబ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు తెలిపింది. ఇదే బాటలో అన్ని రాష్ట్రాలు చేయడానికి రెడీ అయ్యాయి.

ఇక ఇంటర్మీడియెట్ పరీక్షల విషయంలో భారత ప్రభుత్వం నిర్ణయం కీలకం కానుంది. దానిప్రకారమే వారి ప్రమోట్ ఆధారపడి ఉందని పంజాబ్ సీఎం తెలిపారు.
Tags:    

Similar News