స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. మరోసారి టెన్త్ పరీక్షలు రద్దు - అందరూ పాస్!
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి జోరు మళ్లీ ఊపందుకుంది. దేశంలో సెకండ్ వేవ్ మూమెంట్స్ కనిపిస్తున్నాయని కొందరు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. కేంద్రం కూడా మరోసారి దేశంలో కరోనా భారీగా వ్యాప్తి చెందకుండా రాష్ట్రాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మళ్లీ కరోనా పెరిగిపోతుంది కాబట్టి మరోసారి లాక్ డౌన్ వేసే అవకాశం ఉందంటూ వార్తలు వెలువడుతుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
ఈ క్రమంలో స్టూడెంట్స్ కి తమిళనాడు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది కూడా పరీక్షలను రద్దుచేసినట్లు ప్రకటించింది. 9 - 10 - 11వ తరగతుల విద్యార్థులు పరీక్షలు లేకుండా పాస్ చేస్తామని తమిళనాడు సీఎం పళనిస్వామి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఆ మూడు తరగతుల విద్యార్థుల్ని ప్రమోట్ చేస్తున్నట్లు చెప్పారు. కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గతేడాది కూడా కరోనా కారణంగా తమిళనాడు ప్రభుత్వం పరీక్షలు లేకుండానే స్కూల్ విద్యార్థుల్ని పాస్ చేసిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఈ ఏడాది విద్యార్థులు పలు సమస్యలు ఎదుర్కొన్నారు. అందుకే పరీక్షలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా గుడ్ న్యూస్ చెప్పింది. రిటైర్మెంట్ వయసును 59 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి పళని స్వామి అసెంబ్లీలో ప్రకటించారు. సీఎం నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా ఉన్న పళని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.