ఒక్క సెంచరీ చేస్తే మూడు రికార్డులు.. కోహ్లీకి మంచి చాన్స్..!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్ట్ సీరీస్‌లో ఒక్క సెంచరీ చేస్తే మూడు రికార్డులు బద్దలు కొట్టనున్నాడు. గురువారం అడిలైడ్ వేదికగా పింక్ బాల్ టెస్ట్ క్రికెట్ ప్రారంభం కానున్నది. అయితే ప్రతి మ్యాచ్‌లోనూ పరుగులే లక్ష్యంగా ఆడే విరాట్ ఇప్పుడు రికార్డులు నెలకొల్పడం ఖాయమని విరాట్ అభిమానులు అంటున్నారు. అయితే ఈ సీరిస్‌లో విరాట్ గనక 180 పరుగులు సాధిస్తే.. అడిలైట్ స్టేడియంలో అత్యధిక పరుగులు సాధించిన నాన్ ఆస్ట్రేలియన్ ఆటగాడికి రికార్డు నెలకొల్పనున్నాడు.
ఇప్పటివరకు ఇక్కడ వెస్టిండీస్ ఆటగాడు లారా 4 మ్యాచ్ ల్లో 610 పరుగులు చేసి రికార్డ్ నెలకొల్పాడు. అయితే మూడు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 431 రన్స్ చేశాడు. ఆస్ట్రేలియాలో 20 టెస్టులు ఆడిన సచిన్ 1809 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు ఉన్నాయి. అయితే విరాట్ మాత్రం కేవలం 12 టెస్టుల్లోనే 1274 పరుగులు చేశాడు. అందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. ఇప్పుడు విరాట్ మరో సెంచరీ చేస్తే సెంచరీ ల్లో సచిన్ రికార్డు ను బ్రేక్ చేయనున్నాడు.
కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 41 సెంచరీలు చేశాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ కూడా పాంటింగ్ 41 సెంచరీలు చేశాడు. అయితే ఇప్పుడు విరాట్ సెంచరీ చేస్తే.. ఆ రికార్డును బద్దలు కొట్టనున్నాడు. ఇప్పటివరకు కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో 70 సెంచరీలు చేశాడు. సచిన్ వంద, రికి పాంటింగ్ 71 స్థానాల్లో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. అయితే విరాట్ మరో సెంచరీ చేస్తే రెండో స్థానం లోకి వెళతాడు. ఏది ఏమైనా విరాట్‌కు ఈ టెస్ట్ సీరిస్ రికార్డుల మోత మోగించనున్నది. ఫ్యాన్స్ కూడా విరాట్ రికార్డులు ఎప్పుడెప్పుడు బద్ధలు కొడతాడా అని ఎదురు చూస్తున్నారు.