బంగారం నమ్ముకుంటే బెటర్: మార్కెట్ వర్గాల అభిప్రాయం
లాక్ డౌన్ పరిస్థితులతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం అనిశ్చితులు, రేటింగ్ సంస్థల ప్రతికూలతలు అలుముకున్నాయి. ఈ సంక్షోభ సమయాల్లో ఇన్వెస్టర్లకు ఆదాయాలను ఇచ్చే ఏకైక అసెట్ క్లాస్ సాధనం బంగారం మారింది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బంగారమే దిక్కుగా ఏర్పడింది. దీనిలో ఎలాంటి సందేహం లేదు. అందుకే బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.
దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్) మార్కెట్లో బుధవారం 10 గ్రాముల బంగారం ధర 48,589 రూపాయల వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. భవిష్యత్ లో బంగారం ధర ఇంకా పెరుగుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ట్రెండ్ ఇంకా కొనసాగుతుందని వ్యాపారులు.. మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నారు.
భారత ఆర్థిక వృద్ధి అవుట్ లుక్‌ను అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) తగ్గించడం, చైనా తో నెలకొన్న సరిహద్దు వివాదాలు, దేశవ్యాప్తంగా కేసుల పెరుగుదల భయాలు, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరగడానికి కారణమవుతోంది. ఈ ర్యాలీ నిరంతరం కొనసాగే అవకాశం ఉంది. దేశీయంగా బంగారానికి డిమాండ్‌ను పెంచుతాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే క్రమంలోనే వచ్చే రెండేళ్లలో 10 గ్రాముల బంగారం ధర రూ.68 వేల స్థాయికి చేరుకునేట్టు పరిస్థితులు ఉన్నాయి.
కేసులు తగ్గినా బంగారం ర్యాలీ కొనసాగేందుకు అవకాశం ఉందని చర్చ నడుస్తోంది.. దేశీయంగా వచ్చే ఏడాదిన్నర, రెండేళ్లలో బంగారం ధర రూ.65,000-68,000 శ్రేణిని అందుకునేందుకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. డాలర్ మారకంలో రూపాయి కదలికపై బంగారం మూమెంటం ఆధారపడి ఉంటుందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.
ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు మరో రెండేళ్ల పాటు సులభమైన ద్రవ్య పాలసీ విధానానికే కట్టుబడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారానికి వ్యతిరేక దిశ లో ట్రేడయ్యే డాలర్, అమెరికా బాండ్ ఈల్డ్స్ బలహీన పడుతున్నాయి. ఈ అంశాలన్ని బంగారం ర్యాలీ కి సహకరించే అంశాలే కావడం విశేషం.
2021ఎఫ్‌వైలో భారత్ ఆర్థికవృద్ధి 4.5శాతం క్షీణత మహమ్మారి భారత ఆర్థిక వ్యవస్థను భారీగా దెబ్బతీసింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు ఏకంగా 4.5 శాతం పడిపోయిందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.