గోల్డ్ మ్యాన్ దయనీయ మరణం

Update: 2020-05-08 05:00 GMT
బతికున్నప్పుడు ఎంత దర్జాగా బతికినా.. చనిపోయిన తర్వాత నలుగురు వెంట వచ్చేంత మర్యాద.. గౌరవం సంపాదించుకోవాలన్న తపన చాలామందిలో కనిపిస్తుంది. తాను బతికున్నంత కాలమంతా మీడియాలోనూ.. చుట్టుపక్కల వారి గుర్తింపుతో పాటు.. ఎంతో మంది అభిమానించే వారిని సంపాదించుకున్నా.. కాలం కలిసి రాకపోతే పరిస్థితి ఎంతలా ఉంటుందనటానికి తాజా ఉదంతం ఒక పెద్ద ఉదాహరణగా చెప్పాలి. ఒంటి మీద కిలోల కొద్దీ బంగారాన్ని ధరిస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచే పూణె వ్యాపారి 39 ఏళ్ల సమ్రాట్ మోఝే ఆకస్మికంగా మరణించారు. బతికున్నంత కాలం గోల్డ్ మ్యాన్ గా బతికేసిన ఆయన మరణం గురించి తెలిసిన వారంతా ఆయ్యో అనకుండా ఉండలేక పోతున్నారు.

బంగారం మీద విపరీతమైన మోజు ప్రదర్శించే సమ్రాట్.. తక్కువలో తక్కువగా ఒంటి మీద ఎనిమిది నుంచి పది కేజీల బంగారాన్ని ధరించేవారు. తల్లి.. భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్న ఆయన.. తక్కువ వయసులోనే గుండెపోటుకు గురయ్యారు. దీంతో.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే.. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆయన ప్రాణాల్ని కాపాడలేకపోయారు.

బతికి ఉన్నంత కాలం గోల్డ్ మ్యాన్ గా పేరు ప్రఖ్యాతులతో పాటు.. ఎప్పుడూ హడావుడి చేసే గణం వెంట ఉండే దానికి భిన్నంగా కరోనా కారణంగా నెలకొన్న పరిమితులతో తక్కువ మందితో ఎలాంటి ఆర్బాటం లేకుండానే ఆయన అంత్యక్రియులు ముగిశాయి. లాక్ డౌన్ నేపథ్యంలో మరణం వేళ ఇరవై మందికి మించకూడదన్న నిబంధన కారణంగా ఆయన అంత్యక్రియులు చాలా సింఫుల్ గా ముగిశాయి. ఒంటి మీద భారీగా బంగారాన్ని వేసుకొని తిరిగే సమ్రాట్.. చివరకు ఉత్తినే వెళ్లిపోవాల్సి రావటం గమనార్హం. ఆయన మరణం అయ్యో అనిపించేలా ఉందన్న మాట పలువురి నోట వినిపించింది.
Tags:    

Similar News