ఏపీలో బంగారం తవ్వకాలు .. రామగిరిలో తవ్వకాలకు ఎన్‌ఎండీసీ ప్లాన్ !

Update: 2021-02-02 00:30 GMT
ఆంధ్రప్రదేశ్ బంగారు నిక్షేపాలు దేశంలో పుష్కలంగా లభించే రాష్ట్రాల్లో ఐదో స్థానంలో ఉంది. బీహార్‌, రాజస్ధాన్‌, కర్నాటక, పశ్చిమబెంగాల్ తొలి నాలుగు స్ధానాల్లో ఉండగా ఆ తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇక్కడి రాయలసీమ ప్రాంతంలో గతంలో బంగారం తవ్వకాలు భారీగా జరిగేవి. కానీ, కొన్ని కారణాలతో జాతీయ ఖనిజాభివృద్ధి సంస్ధ వీటి తవ్వకాలను నిలిపేసింది.

ఆ తర్వాత , తిరిగి రెండు దశాబ్దాల తర్వాత తిరిగి ఈ ప్రాంతంలో బంగారం తవ్వకాలకు ప్రయత్నాలు మొదలయ్యాయి. చాలా రోజుల తర్వాత జాతీయ ఖనిజాభివృద్ధి సంస్ధ ఎన్‌ఎండీసీ తిరిగి ఇక్కడ బంగారం అన్వేషణకు సిద్ధమవుతోంది. రాయలసీమలోని చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో బంగారం అన్వేషణకు ఎన్ ‌ఎండీసీ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో చిగురుగుంటలో బంగారం తవ్వకాలకు అనుమతులు దక్కించుకున్న ఎన్‌ ఎండీసీ, ఇప్పుడు అనంతపురం జిల్లాలోని రామగిరిలోనూ తవ్వకాలకు ఏర్పాట్లు చేసుకుంటోంది.

ఇక్కడ ఓసారి తవ్వకాలు చేపడితే ఎంత మేరకు బంగారం దొరకవచ్చు, ఎంత ఖర్చవుతుంది, అది గిట్టుబాటు వ్యవహారమేనా కాదా అన్న అంశాలను అధ్యయనం చేసేందుకు ఎన్‌ఎండీసీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది. తవ్వకాలకు అనుమతి రాగానే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అనంతపురం జిల్లా రామగిరిలో రెండు దశాబ్దాల క్రితం బంగారం మైనింగ్‌ జరిగింది.

అప్పట్లో భారత్‌ గోల్డ్‌ మైన్స్‌ లిమిటెడ్‌ సంస్ద ఇక్కడ తవ్వకాలు నిర్వహించింది. అయితే అప్పట్లో బంగారం ధరలు తక్కువగా ఉండేవి. బంగారం తవ్వి తీసేందుకు అయిన ఖర్చుతో పోలిస్తే దాన్ని అమ్మితే వచ్చే ఖర్చు బాగా తక్కువగా ఉండంటంతో గోల్డ్ మైనింగ్‌ ను నిలిపేశారు.

అనంతపురం జిల్లా రామగిరిలో రెండు దశాబ్దాల క్రితం బంగారం మైనింగ్‌ జరిగింది. అప్పట్లో భారత్‌ గోల్డ్‌ మైన్స్‌ లిమిటెడ్‌ సంస్ద ఇక్కడ తవ్వకాలు నిర్వహించింది. అయితే అప్పట్లో బంగారం ధరలు తక్కువగా ఉండేవి. బంగారం తవ్వి తీసేందుకు అయిన ఖర్చుతో పోలిస్తే దాన్ని అమ్మితే వచ్చే ఖర్చు బాగా తక్కువగా ఉండంటంతో గోల్డ్ మైనింగ్ ‌ను నిలిపేశారు. అయితే , ఆ తర్వాత  గోల్డ్‌ మైనింగ్‌ నిర్వహించి ఖనిజాన్ని వెలికితీస్తే ఎగుమతులు చేసే అవకాశాలను ఎన్ ‌ఎండీసీ పరిశీలిస్తోంది. రామగిరిలో బంగారపు గనుల తవ్వకాలను ప్రారంభిస్తే వందల అడుగుల లోతుకు తవ్వకాలు చేపట్టాల్సి ఉంటుంది.

ఈ స్ధాయిలో తవ్వకాలు జరిగితే టన్నుకు 2 నుంచి 3 గ్రాముల బంగారం లభ్యమవుతుందని ఎన్‌ ఎండీసీ ప్రాధమికంగా అంచనా వేస్తోంది. కొన్ని చోట్ల ఎక్కువగా, మరి కొన్ని చోట్ల కొంత తక్కువగా కూడా ఉండొచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు జరిగితే అతి త్వరలో ఈ తవ్వకాలు ప్రారంభం కావొచ్చని తెలుస్తోంది.
Tags:    

Similar News