మీ ఫోన్లో ‘పెగాస‌స్’ దూరిందా? ఇలా చెక్ చేసుకోవ‌చ్చ‌ట!

Update: 2021-07-21 15:30 GMT
'పెగాస‌స్‌..' ఇప్పుడు ఈ పేరు వింటే చాలు ప్ర‌పంచం మొత్తం ఆందోళ‌నకు గుర‌వుతోంది. ఎప్పుడు త‌మ ఫోన్ పై దాడి చేస్తుందో.. ఏ రూపంలో ఎటాక్ చేస్తుందో తెలియ‌క స‌త‌మ‌తం అవుతున్నారు. ఈ మాల్ వేర్ దాడి చేస్తే.. మ‌న‌కు తెలియ‌కుండానే ఫోన్లోని ఫొటోలు, వీడియోలు, సీక్రెట్ పాస్ వ‌ర్డ్స్.. ఒక్క‌టేమిటీ అన్నీ త‌న ఆధీనంలోకి తీసుకుంటుంది. కేవ‌లం మ‌న ఫోను మ‌న వ‌ద్ద‌ ఉంటుంది. కానీ.. మ‌న ఫోన్లో స‌మాచారం మొత్తం అవ‌త‌లి వారి చెంత‌కు వెళ్లిపోతోంది.  ఇంత‌టి ప్ర‌మాద‌క‌ర‌మైన హ్యాకింగ్ సాఫ్ట్ వేర్ ఇప్పుడు అన్ని దేశాల‌నూ ఆందోళ‌న‌కు గురిచేస్తోంది.

అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న హ్యాకింగ్ విధానంలో.. మ‌న‌తో పొర‌పాటు చేయించి, మ‌న ఫోన్లోకి దూరిపోతాయి. ఫోన్‌ ట్యాప్ చేయ‌డానికి ఒక లింక్ ను మెసేజ్ ద్వారా మ‌న‌కు పంపిస్తారు. దాన్ని ఓపెన్ చేస్తే.. ఆ సాఫ్ట్ వేర్ ఫోన్ లో ఇన్ స్టాల్ అవుతుంది. ఆ త‌ర్వాత పూర్తిగా హ్యాక‌ర్ ఆధీనంలోకి వెళ్లిపోతుంది. అయితే.. ఇది ఇప్పుడు పాత‌ విష‌యం. పెగాస‌స్ టూల్‌ మాత్రం అంత‌కు మించి అన్న ప‌ద్ధ‌తిలో హ్యాక్ చేస్తుంది. ఈ మాల్ వేర్ మ‌న ప‌ర్మిష‌న్ తో సంబంధం లేకుండా.. అస‌లు మ‌నం ఏ లింక్ ను కూడా ఓపెన్ చేయ‌కుండానే మ‌న ఫోన్లో చేరిపోతుంది. అది కూడా.. కేవ‌లం ఒక మిస్డ్ కాల్ ఇవ్వ‌డం ద్వారా మ‌న ఫోన్ ను హ్యాక్ చేసేస్తుంది. అంటే.. మ‌న ఫోన్ నంబ‌ర్ తెలిస్తే చాలు. మిస్డ్ కాల్ ఇచ్చేసి, హ్యాక్ చేసేస్తారు.

ఇక‌, ఇంకో విష‌యం ఏమంటే.. అస‌లు ఈ వైర‌స్ మ‌న ఫోన్లోకి చేరింద‌న్న సంగ‌తి గుర్తించ‌డం దాదాపుగా అసాధ్యం. అధునాత‌న‌మైన ప‌ద్ధ‌తిలో దీన్ని టెస్ట్ చేస్తే త‌ప్ప‌, బ‌య‌ట‌ప‌డ‌దు. అంతేకాదు.. ఈ సాఫ్ట్ వేర్ ఒక్క‌సారి మ‌న‌ ఫోన్లో గ‌న‌క‌ చేరిపోతే ఇక ఏమీ చేయ‌డానికి లేద‌ని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఫోన్ ప‌క్క‌న‌ప‌డేసి, ముఖ్య‌మైన‌ పాస్ వ‌ర్డులు చేంజ్ చేసుకోవాల్సిందేన‌ని అంటున్నారు. అయితే.. ఇలాంటి స‌మ‌యంలో ఫోన్‌ వినియోగ‌దారుల‌కు ఓ శుభ‌వార్త అందింది. ఈ మాల్ వేర్ మ‌న ఫోన్లోకి చేరిందా? లేదా? అనే విషయాన్ని తెలుసుకునేందుకు తామొక టూల్ ను సిద్ధం చేశామ‌ని బ్రిట‌న్ కు చెందిన స్వ‌చ్ఛంద సంస్థ ఆమ్నెస్టీ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్ర‌క‌టించింది. కాల్డ్ మొబైల్ వెరిఫికేష‌న్ టూల్ (ఎంవీటీ) కిట్ ను డిజైన్ చేసిన‌ట్టు తెలిపింది.

ఈ టూల్ కిట్ సాయంతో.. పెగాస‌స్ ను గుర్తించ‌డం సాధ్య‌మ‌వుతుంద‌ని తెలిపింది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ డివైజ్ ల‌ను పెగాస‌స్ దాడి చేసిందా? లేదా? అనే విష‌యాన్ని ఈ టూల్ తో గుర్తించ‌డం సాధ్య‌మ‌వుతుంద‌ని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం వినియోగ‌దారులు ఏం చేయాల‌నేది కూడా చెబుతున్నారు. ఎలా చేయాలో కూడా వివ‌రిస్తున్నారు.

ఇందుకోసం ముందుగా వినియోగ‌దారులు త‌మ స్మార్ట్ ఫోన్లో ఉన్న డేటాను ఎంవీటీ ఫోల్డ‌ర్ లో బ్యాక‌ప్ చేయాల్సి ఉంటుంది. బ్యాక‌ప్ పూర్త‌యిన త‌ర్వాత ప్రోగ్రాం ద్వారా (క‌మాండ్ లైన్ ఇంట‌ర్ ఫేస్‌) యూజ‌ర్ల‌కు కాంటాక్ట్స్ తోపాటు ఫొటోలు ఇత‌ర ఫోల్డ‌ర్లంన్నిటినీ ఇది చెక్ చేస్తుంది. ఒక‌వేళ క‌మాండ్ లైన్ ఫేస్ లో పెగాస‌స్ ఉంటే.. దాన్ని తొల‌గించ‌డానికి కూడా ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని చెబుతున్నారు. అత్యంత ప్ర‌మాద‌క‌రంగా ప‌రిణ‌మించిన ఈ పెగాస‌స్ ను ఎదుర్కొనేందుకు ఈ టూల్ అందుబాటులోకి రావ‌డం మంచి విష‌య‌మ‌ని ప‌లువురు అభిప్రాయ ప‌డుతున్నారు. మ‌రి, ఈ ఎంవీటీ కిట్ ప‌నితీరు ఎలా ఉంటుందో అన్న‌ది ముందు ముందు చూడాలి.
Tags:    

Similar News