*జ‌న‌ర‌ల్‌* స‌ర్వే!... వైసీపీకి 19, టీడీపీకి నాలుగే!

Update: 2019-01-06 08:45 GMT
ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు సార్వ‌త్రిక ఎన్నిక‌లు కూడా జ‌ర‌గ‌నున్నాయి. వ‌చ్చే నెల‌లో నోటిఫికేష‌న్ రానున్న ఈ ఎన్నిక‌లు ఏప్రిల్‌, మే నెల‌ల్లో జ‌ర‌గ‌నున్నాయి. మొత్తంగా అటు ముంద‌స్తు కాకుండా ఇటు లేటుగానే కాకుండా 2014లో జ‌రిగిన మాదిరే 2019 ఎన్నిక‌లు కూడా షెడ్యూల్ ప్ర‌కార‌మే జ‌ర‌గ‌నున్నాయ‌న్న మాట‌. గ‌డ‌చిన ఎన్నిక‌ల నాటి నుంచి దేశ రాజ‌కీయాల్లో ఓ మోస్త‌రు మార్పులు రాగా... ఏపీలో మాత్రం పెను మార్పులే వ‌చ్చాయి. ఆ ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని, జ‌న‌సేన చేయూత‌తో టీడీపీ అధికార ప‌గ్గాల‌ను ద‌క్కించుకుంది. అయితే ఇప్పుడు అటు బీజేపీతో పాటు, ఇటు జ‌న‌సేన కూడా టీడీపీకి దూరంగా ఉన్నాయి. దూరంగా ఉండ‌టమే కాకుండా ఈ రెండు పార్టీలు కూడా వ‌చ్చే ఎన్నికల్లో టీడీపీతో క‌లిసి బ‌రిలోకి దిగే ఛాన్సే లేద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. అస‌లే అధికారంలో ఉన్న పార్టీగా ఎంతో కొంత ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను టీడీపీ సంపాదించుకుంటుంది క‌దా. అయితే ఇక్క‌డ ప‌రిస్థితి చూస్తే... భారీ ఎత్తున ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకుంద‌ని తెలుస్తోంది. ఇదేదో టీడీపీకి వైరి వ‌ర్గాలు చెబుతున్న మాటో, చేయిస్తున్న స‌ర్వే చెబుతున్న మాటో కాదు. జాతీయ స్థాయి స‌ర్వే సంస్థ‌లు నిక్క‌చ్చిగా స‌ర్వే చేసి చెబుతున్న మాట ఇది.

ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే... టీడీపీకి ఎన్ని లోక్ స‌భ సీట్లు వ‌స్తాయి అన్న విష‌యం చూస్తే... ఆశ్చ‌ర్యం వేయ‌క మాన‌దు. మొత్తం 25 చోట్ల టీడీపీ పోటీ చేసినా... ఆ పార్టీకి కేవలం నాలుగంటే నాలుగు ఎంపీ సీట్లు మాత్ర‌మే ద‌క్కుతాయ‌ట‌. అదే స‌మ‌యంలో గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో సింగిల్‌గానే బ‌రిలోకి దిగ‌డంతో పాటు అమలు సాధ్యం కాని హామీల‌ను ఇచ్చి ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌లేనంటూ కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలోని వైసీపీకి ఈ ద‌ఫా ఏకంగా 19 లోక్ స‌భ సీట్లు ద‌క్కుతాయ‌ట‌. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ఏపీలో 8 సీట్లు, తెలంగాణ‌లో ఓ సీటు సాధించిన వైసీపీకి ఈ ద‌ఫా ఒక్క ఏపీలోనే ఏకంగా 19 సీట్లు ద‌క్క‌నున్నాయ‌ని స‌ద‌రు స‌ర్వే తేల్చేసింది. ఇక మిగిలిన రెండు ఎంపీ సీట్ల‌ను కాంగ్రెస్ పార్టీ ఎగుర‌వేసుకుపోతుంద‌ట‌. ఎన్నిక‌ల్లో  ఏ ఒక్క‌రూ ఊహించ‌నంత మేర స‌త్తా చాటుతామ‌ని బీరాలు ప‌లుకుతున్న జ‌న‌సేన‌కు అస‌లు లోక్ స‌భ సీట్ల‌లో కౌంటే ద‌క్క‌ద‌ట‌. మొత్తంగా ఈ స‌ర్వే చూస్తే... జ‌గ‌న్ వైరి వ‌ర్గాలన్నీ ఉడికిపోతాయ‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేద‌నే చెప్పాలి. అయినా ఈ స‌ర్వే చేసిందెవ‌ర‌న్న విష‌యానికి వ‌స్తే... టీవీ-సీఎ ఎన్ ఎక్స్ సంస్థ ఈ స‌ర్వే చేసింది. దేశంలోని మొత్తం 543 పార్ల‌మెంటు నియోజ‌కవ‌ర్గాల‌తో పాటు 1086 అసెంబ్లీ నియోజవ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను సేక‌రించి మ‌రీ ఈ సంస్థ ఈ స‌ర్వే చేసిందట‌.

ఇక గ‌డ‌చిన ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగిన బీజేపీకి ఏపీలో పెద్ద‌గా ఆశించిన మేర ఫ‌లితాలు రావ‌ని కూడా ఆ స‌ర్వే తేల్చేసింది. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో రెండు ఎంపీ సీట్ల‌ను గెలుచుకున్న బీజేపీకి ఈ ద‌ఫా ఒక్క‌టంటే ఒక్క ఎంపీ సీటు కూడా ద‌క్క‌ద‌ట‌. ఇక ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం తాము మాత్ర‌మే పోరాటం చేస్తున్నామ‌ని జ‌బ్బ‌లు చ‌రుచుకుంటున్న టీడీపీని ఏపీ ప్ర‌జ‌లు ఎంత‌మాత్రం న‌మ్మ‌డం లేద‌ని కూడా ఈ స‌ర్వే తేల్చేసింది. లోక్ స‌భ‌లో రోజూ త‌మ‌దైన నిర‌న‌స‌య ప్ర‌ద‌ర్శన‌లు చేస్తున్న టీడీపీ... జ‌నాన్ని మ‌భ్య‌పెట్ట‌డం మిన‌హా చేసిందేమీ లేద‌న్న మాట‌ను కూడా ఈ స‌ర్వే తేల్చేసింద‌న్న మాట వినిపిస్తోంది. అదే స‌మ‌యంలో ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ఏకంగా త‌మ ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసిన పార్టీగా వైసీపీకి మంచి మైలేజీ ద‌క్కింద‌ని, ఈ మైలేజీ కార‌ణంగానే వ‌చ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి అత్య‌ధిక ఎంపీ స్థానాల‌ను ఏపీ ప్ర‌జ‌లు క‌ట్ట‌బెట్ట‌నున్నార‌ని కూడా ఆ స‌ర్వే చెప్పిన‌ట్టైంది. గుడ్డిలో మెల్ల అన్న మాదిరిగా గ‌డ‌చిన ఎన్నికల్లో జీరో కౌంట్‌ తోనే స‌రిపెట్టుకున్న కాంగ్రెస్‌కు ఈ సారి ఏపీ ప్ర‌జ‌లు ఓ రెండు సీట్ల‌ను మాత్రం ఇస్తార‌ట‌. వైసీపీకి క్లీన్ స్వీపేన‌న్న రీతిలో వెలువ‌డిన ఈ స‌ర్వే రిపోర్ట్ ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర తీసింది.






Full View
Tags:    

Similar News