డీ అంటే డీ ... గంగుల వర్సెస్ సంజయ్
సాధారణంగా ఎవరైనా కనిపించకుంటే పోలీస్ స్టేషన్స్ లో ఫిర్యాదు చేయడం, పోస్టర్లు వేయడం సహజమే. కాని ఆ జిల్లాలో లీడర్లు కనిపించడం లేదట. ఎంపిగా గెలిచిన పలానా లీడర్ ఎక్కడా అని పోస్టర్లు వేసి నిరసన చేస్తే తామేమి తక్కువ తిన్నామంటూ అసలు మంత్రులే కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లలోనే కొందరు ఫిర్యాదు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో టీఆర్ ఎస్ వర్సెస్ బిజెపి అనుకోవాలా లేక మంత్రి గంగుల వర్సెస్ ఎంపి సంజయ్ అనుకోవాలో తెలియదు. కాని రెండు పార్టీల క్యాడర్ డీ అంటే డీ అంటూ పోటాపోటీగా రోడ్డెక్కుతున్నారు. ఇంతకీ ఆ ఇద్దరి టార్గెట్ ఎవ్వరు ఆ ఇద్దరి మద్య పచ్చ గడ్డేస్తేనే అంతగా ఎందుకు మండుతోంది...
బండి సంజయ్, మంత్రి గంగుల కమలాకర్. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యే కాదు వీరి క్యాడర్ మధ్య కూడా ఢీ అంటే ఢీ అనే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో కారుజోరు చూపించిన తరుణంలో గులాబీ గడ్డ కరీంనగర్ నుంచి బండి సంజయ్ ఎంపీగా గెలువడం అధికార పార్టీకి మింగుడు పాడనీ విషయమే. అయితే సంజయ్ ను గులాబీ పార్టీ లీడర్లు కాని, అధికారులు కాని అంతగా పట్టించుకోవడం లేదు. మహా అయితే , అరిచి గీ పెడుతారే తప్ప, బండి సంజయ్ ఏమి చేయలేరని డిసైడ్ అయ్యి సైలెంట్ అయ్యారు.
ఇందులో భాగంగా ఇటీవల బావుపేట గ్రామంలో సంజయ్ కు వ్యతిరేకంగా ధర్నా చేశారు. ఎంపీగా బండి సంజయ్ గెలిచిన తరువాత తమ గ్రామానికి రాలేదంటూ ఓ ఫ్లెక్సీతో టెంట్ వేసుకుని ధర్నాకి దిగారు. ఈ ధర్నాని చూపిస్తూ ఇది ఎంపీగా బండి సంజయ్ కి సిగ్గు చేటు అంటూ రాజకీయంగా సోషల్ మీడియా,మీడియా వేదికగా విమర్శలు గుప్పించింది టీఆర్ ఎస్. అయితే, ఇదంతా టీఆర్ ఎస్ పార్టీ పనే అంటూ బీజేపీ శ్రేణులు కౌంటర్ ఎటాక్ చేశారు. టీఆర్ ఎస్ లో ఉన్న నాయకుడు ఒకరు దగ్గరుండి ఈ ధర్నా చేయించారని విమర్శిస్తూ కొన్ని చాటింగ్ స్క్రీన్ షార్ట్స్ ని విడుదల చేశారు. దీనిపై పోలీస్ స్టేషన్స్ లో కేసు నమోదు చేసారు.
కానీ ఇప్పుడు ఈ గొడవ కాస్త ఇప్పుడు రాష్ట్ర స్థాయికి వెళ్ళింది. కరీంనగర్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో బిజెపి కార్యకర్తలు, రాష్ట్ర మంత్రులు కనపడటం లేదంటూ పోలీస్ స్టేషన్‌లలో కంప్లైంట్స్ చేశారు. ఎంపీ సంజయ్ కనపడటం లేదంటూ బావుపేట గ్రామంలో ధర్నాకి కౌంటర్ గా, ఉమ్మడి జిల్లా మంత్రులు, తమ ప్రాంతాలకి రావడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు చేసింది. అయితే బావుపేట ధర్నా అంశంపై మంత్రి గంగుల కమలాకర్ సైతం మాట్లాడుతూ ఓ ప్రజాప్రతినిధిపై గ్రామస్థులు ఇలా చేయడం సరికాదంటూనే, టీఆర్‌ఎస్ ధర్నా చేయించిందని బీజేపీ అనడంపై ఫైర్ అయ్యారు. అంత దిగజారుడు రాజకీయం మేము చేయము అంటూ గులాబీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.
బండి సంజయ్ ఎంపీగా గెలిచినా తరువాత వెంటనే అధ్యక్ష్య పదవి రావడం రాష్ట్రవ్యాప్తంగా తిరగాల్సి రావడంతో కరీంనగర్ పార్లమెంట్ లో ఎక్కువ సమయం కేటాయించలేకపోయారు అని నిపుణులు అంటున్నారు. అయితే ఇంతా జరుగుతున్న బిజెపిలోని కార్యకర్తలు మినహా, జిల్లాస్థాయి నాయకులు మాత్రం కౌంటర్ సరిగా ఇవ్వలేకపోయారు. మరోవైపు ఎంపీ సంజయ్ కి షాక్ ఇస్తూ బిజెపి కార్పొరేటర్ ఒకరు టీఆర్ ఎస్ కండువా కప్పుకున్నారు. అలాగే బిజెపిలో జిల్లా సీనియర్ లు, సంజయ్ కి మధ్య గ్యాప్ ఉండటంతో ఈ గొడవని పెద్దగా పట్టించుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఇప్పుడు బావుపేట గ్రామం ఉన్నట్టుండి జిల్లాలో రాజకీయ వేడిని పెంచిందంటూన్నారు