రైతుల కోసం 'ఫ్రీ' మసాజ్‌ సెంటర్లు !

Update: 2020-12-12 10:12 GMT
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతన్నల ఉద్యమానికి ఎంతోమంది మద్దుతు తెలుపుతున్నారు. రైతుల ఉద్యమానికి ఎన్నోసంస్థల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ఈక్రమంలో రైతుల కోసం ఇంటర్‌ నేషనల్‌ ఎన్‌ జీవో ఖాల్సా మసాజ్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది. రోజంతా ఉద్యమంలో నినాదాలు చేసి..నడుస్తూ నిరసనలు చేసి అలసిపోయిన రైతన్నలు సాయంత్రం అయ్యేసరికి అలసిపోతున్నారు. ఆ  అలసిపోయిన వృద్ద రైతుల కోసం మా వంతు భాద్యతగా వారి కోసం ఫుట్‌ మసాజ్‌ సెంటర్లను ఏర్పాటు చేశాము’  అని  ఖాల్సా మేనేజింగ్‌ డైరెక్టర్‌ అమర్‌ప్రీత్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

దీనితోపాటు 400 వాటర్‌ప్రూఫ్‌ టెంటులు, గ్లిసరిన్‌ సదుపాయం గల బాత్‌ రూంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తేజిందర్‌ పాల్‌ సింగ్‌ అనే వాలంటీర్‌ మాట్లాడుతూ, ఉద్యమంలో పాల్గొనటానికి వచ్చిన రైతులకు మొదటి రోజు నుంచి అందరికీ ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తున్నామనీ, ఢీల్లీలో చలినుంచి రక్షించడానికి దుప్పట్లను రైతులకు 10 ట్రక్కుల దుప్పట్లు తెచ్చామని తెలిపారు. చాలాదూరం నుంచి ప్రయాణించి అలసిపోయిన రైతులకు ఫుట్‌ మసాజ్ ‌లు చాలా ఉపయోగకరంగా ఉన్నాయనీ, అలసిపోయినవారికి మసాజ్ చేస్తు ఉపశమనం కలిగిస్తున్నాయని తెలిపారు. అన్నదాతలకు ఇటువంటి సేవలు అందిస్తుండటంతో రైతులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారని తేజిందర్ తెలిపారు.

ఫుట్ మసాజ్ లపై రైతులు మాట్లాడుతూ..చాలా దురం నుంచి ప్రయాణం చేసి ఢిల్లీకి వచ్చిన మాకోసం ఎంతోమంది మద్దతుగా ఉండటం చాలా సంతోషంగా ఉందనీ..ఫుట్‌ మసాజ్‌ సెంటర్ ‌ల వల్ల సేదతీరుతున్నామని తెలిపారు. కాగా ప్రభుత్వం రైతులతో జరుపుతున్న చర్చలకు రైతు సంఘాలు ఏమాత్రం అంగీకరించటంలేదు. చట్టాలను రద్దు చేయాలను డిమాండ్ మీదనే నిలబడ్డారు. రైతులకు నష్టం కలిగించే ఏ చట్టాలు మాకొద్దనీ నినదిస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్ ‌తో రైతు సంఘాలు చేపట్టిన ఆందోళన మరో మలుపు తిరిగింది.
Tags:    

Similar News