పెళ్లి వెబ్ సైట్ లో చూసి యువతిని నిండా ముంచారు
పెళ్లిళ్ల వెబ్ సైట్ లో ఆ యువతి తన పేరు నమోదు చేసుకుంది. కర్ణాటకలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న ఆమె తన జీతం, ఉద్యోగం తదితర వివరాలన్నీ ఆ మ్యాట్రీమోని వెబ్ సైట్ లో పెట్టుకుంది. అయితే అమ్మాయి ఎర్రగా బుర్రగా ఉండి స్థిరపడి ఉండడంతో ఓ యువకుడు వల వేసి ఆమెను నిండా ముంచాడు.
మ్యాట్రీమోని పెళ్లి సైట్ లో యువతిని చూసిన ఓ యువకుడు తన పేరు కబీర్ ఆనంద్ అని.. లండన్ లో స్థిరపడ్డానని నమ్మించాడు. ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. తాను ఢిల్లీకి వచ్చానని.. విదేశీ కరెన్సీని భారత్ కరెన్సీగా మార్చేందుకు రూ.3 లక్షల నగదు తన అకౌంట్ కు జమ చేయాలని యువతిని కోరాడు. దీంతో యువతి నమ్మి జమ చేసింది.
అనంతరం ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని సమాధానం వచ్చింది. మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇలా మోట్రీమోని పేరుతో యువకుడు టెకీ యువతిని మోసం చేసిన వైనం చర్చనీయాంశమైంది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇలా ఎన్నిసార్లు పోలీసులు అరెస్ట్ చేసినా యువతులు మోసపోతూనే ఉన్నారు. అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.