ఫిరాయింపుదారులకూ..రాజధాని స్కామ్ కు లింక్?!

Update: 2019-06-23 03:51 GMT
భారతీయ జనతా పార్టీలో చేరిన నలుగురు ఫిరాయింపు ఎంపీలకూ - రాజధాని భూముల స్కామ్ కు  లింక్ ఉందనే ప్రచారం సాగుతూ ఉంది. త్వరలోనే ఏపీ రాజధాని అంశంలో చోటు చేసుకున్న స్కామ్ పై జగన్ ప్రభుత్వం విచారణకు ఆదేశించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.  రాజధాని ఒక పెద్ద స్కామ్ అని - ఆ ప్రాంతంలో రాజధాని రాబోతోందనే అంశాన్ని ముందుగానే తెలుసుకుని అక్కడ తెలుగుదేశం నేతలు పెద్ద ఎత్తున భూములు కొన్నారనే ప్రచారం ఉంది.

ఇది ముందు నుంచి ఉన్న ప్రచారమే. తెలుగుదేశం పార్టీ నేతలు అక్కడ వందల ఎకరాల భూములను కొన్నారని - బినామీలతో అక్కడ వ్యవహారాలను వారు నడిపించారనే ప్రచారం  జరిగింది. ఆ గుట్టును బయట పెట్టాలని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము చేసిన ఆరోపణల గురించి జగన్ ప్రభుత్వం ఇప్పుడు దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ఫిరాయింపు ఎంపీల గుట్టు బయటకు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతూ ఉంది.

బీజేపీలోకి చేరిన నలుగురు ఎంపీలు కూడా రాజధాని ప్రాంతంలో కొన్ని వందల ఎకరాల భూమిని కొనుగోలు చేశారని సమాచారం. ఇప్పుడు విచారణలు - వాస్తవాల వెలికితీత వంటివి జరిగితే… భారీ ఎత్తున వారి అవినీతి కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితిపై అవగాహన  కలిగి వారు ఫిరాయించినట్టుగా ప్రచారం జరుగుతూ ఉండటం గమనార్హం.
Tags:    

Similar News