జగన్ ప్రతిపాదించిన నలుగురు ఇక ఎమ్మెల్సీలు

Update: 2021-06-16 13:15 GMT
ఏపీ సర్కార్ ప్రతిపాదించిన నలుగురు ఎమ్మెల్సీలను నామినేట్ చేసేశారు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్. ఈ మేరకు ఈరోజు బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఏపీలో కొత్త ఎమ్మెల్సీలుగా తోట త్రిముర్తులు, మోషేన్ రాజు, అప్పిరెడ్డి, రమేశ్ లను ఎంపిక చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో గవర్నర్ కోటాలో ఎన్నికైన టీడీ జనార్ధన్, బీద రవిచంద్ర, గౌవిగారి శ్రీనివాస్, పి. శమంతకమణిలకు జూన్ 11తో పదవీకాలం ముగిసింది.వీరి స్థానంలో కొత్తగా మరో నలుగురు ఎమ్మెల్సీలు నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో నలుగురికి కొత్తగా ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది.

గవర్నర్ కోటాలో ఎన్నికయ్యే ఈ సభ్యులకు సాధారణంగా అధికార పార్టీకి చెందిన వారికే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే వైసీపీ అధిష్టానం కూడా నలుగురు నేతలను ఎంపిక చేసి గవర్నర్ కు పంపింది.సీఎం జగన్ గవర్నర్ కోటాలో నలుగురి పేర్లు పంపారు. నిన్న స్వయంగా కలిశారు. వీటిని జూన్ 14న ఆమోదించిన గవర్నర్ గా నోటిఫికేషన్ జారీ చేయడంతో కొత్త ఎమ్మెల్సీలుగా వీరు నలుగురు నామినేట్ అయ్యారు.
Tags:    

Similar News