ఇక‌, ఆ మాజీ ఎంపీ `పొలిటిక‌ల్ ప్ర‌స్థానం` ముగిసిన‌ట్టేనా ?

Update: 2021-05-13 12:30 GMT
ఆయ‌న మాజీ ఎంపీ, పిల్ల‌నిచ్చిన‌ మామ‌గారి ద్వారా రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా.. త‌న‌కంటూ.. ప్ర‌త్యేక‌త‌ను సంతరించుకున్నారు. కొద్దికాలానికే ఆయ‌న త‌న‌దైన శైలిలో రాజ‌కీయాలు చేశారు. స‌ర్వేల జ్యోతిష్యుడిగా జాతీయ రాజ‌కీయాల్లో ఓ వెలుగు వెలిగి ఇప్పుడు గ‌ప్‌చుప్ అయిపోయారు. ఆయ‌నే.. విజ‌య‌వాడ‌కు చెందిన‌.. మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌. కేంద్రంలో ఒక‌ప్పుడు చ‌క్రం తిప్పిన‌.. ప‌ర్వ‌త‌నేని ఉపేంద్ర‌కు స్వయానా ఈయ‌న అల్లుడు. ఈ క్ర‌మంలోనే విజ‌య‌వాడ ఎంపీగా రెండు సార్లు విజ‌యం సాధించారు. త‌న‌కంటూ.. ప్ర‌త్యేక ముద్ర వేసుకున్నారు. అప్ప‌ట్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో రాజ్‌గోపాల్ డైలాగులు, స‌ర్వేలు సంచ‌ల‌నాల‌కు మారుపేరు.

అంతేకాదు.. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో.. గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు కూడా ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మానికి వ్య తిరేకంగా గ‌ళం వినిపించారు. పార్ల‌మెంటులో చ‌ర్చ సంద‌ర్భంగా ఏకంగా పెప్ప‌ర్ స్ప్రే చ‌ల్లి.. డిబేట్‌ను ప‌క్క దారి ప‌ట్టించారు. ఇక‌, రాజ‌కీయ విశ్లేష‌కుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు.. ఎన్నిక‌ల‌కు సంబం ధించి ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలు వెల్ల‌డిస్తూ.. రాజ‌కీయంగా కాక పెంచారు. అయితే 2018 తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల అంచ‌నాలు, ఇటు ఏపీలో 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో ల‌గ‌డ‌పాటి అంచ‌నాలు త‌ప్పాయి.

అక్క‌డ తెలంగాణలో కేసీఆర్ చిత్తుగా ఓడిపోతున్నార‌ని... ఏపీలో ఖ‌చ్చితంగా చంద్ర‌బాబు స‌ర్కారు మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంద‌ని నొక్కి వ‌క్కాణించారు. అయితే.. ఇది విఫ‌ల‌మైంది. దీంతో తాను చేసిన ప్ర‌తిజ్ఞ మేర‌కు ఆయ‌న రాజ‌కీయాల్లో దూరంగా ఉన్నారు. కానీ, ఇప్పుడున్న ప‌రిస్థితిలో రాజ‌కీయ ఉద్దండులు.. వ‌యో వృద్ధులు కావ‌డం, కొంద‌రు మ‌ర‌ణించ‌డం .. వంటి కార‌ణాల నేప‌థ్య‌లో ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ వంటి నేత‌లు పంతాలు ప‌క్క‌న పెట్టి.. రాజ‌కీయాల్లోకి రావాల‌ని పిలుపు నిస్తున్న గ‌ళాలు పెరుగుతున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయాలు ఇంత హీట్‌గా ఉన్నా ఎక్క‌డా ల‌గ‌డ‌పాటి ప్ర‌స్తావ‌నే రావ‌డం లేదు. ఇటీవ‌ల సోష‌ల్ మీడియా వేదిక‌ల్లో ల‌గ‌డ‌పాటికి మ‌ద్ద‌తుగా ఎక్కువ మంది కామెంట్లు చేయ‌డంతో పాటు ల‌గ‌డ‌పాటి పొలిటిక‌ల్‌ రీఎంట్రీ ఇవ్వాలంటూ.. దాదాపు అంద‌రూ కోరుకున్నారు. ఈ ప‌రిణామాలు గ‌మ‌నిస్తే.. మ‌రి ఆయ‌న వ‌స్తారో..లేక ఇంకా పంతానికే పోతారో చూడాలి.




Tags:    

Similar News