బీజేపీ హిందూయిజంపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు
బీజేపీ ఎజెండానే హిందుత్వం. అందులో ఎలాంటి డౌట్స్ లేవు. వారి చర్యలు, మాటలు కూడా అలానే ఉంటాయన్న టాక్ రాజకీయవర్గాల్లో ఉంది. ఇన్నాళ్లు బీజేపీని ఎవరూ ఏమీ అనలేకపోయారు. కానీ ఇప్పుడు ఉత్తరాధిలో రైతుల ఆందోళనతో పరిస్థితి మారుతోంది. ఒక్కరొక్కరుగా బయటకు వస్తున్నారు.
నిన్నటిదాకా బీజేపీ మిత్రుడిగా ఉన్న పంజాబ్ మాజీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై ఆందోళన చేస్తున్న సిఖ్ రైతులపై బీజేపీ మతచిచ్చును పెడుతోందని ఆరోపించారు. పంజాబ్ లో సిఖ్ లపై అక్కడి హిందువులను బీజేపీ ఉసిగొల్పుతోందని మండిపడ్డారు.
ఇప్పటికే దేశంలో ముస్లింలపై హిందువులను రెచ్చగొట్టి మత రాజకీయం చేస్తున్న బీజేపీ మరోవైపు సిఖ్ లపై కూడా హిందువులను రెచ్చగొట్టే వ్యూహాన్ని అవలంభిస్తోందని ఈ మాజీ సీఎం వ్యాఖ్యానించారు.
మొన్నటిదాకా బీజేపీ ఎన్డీఏలో శిరోమణి అకాలీదల్ మిత్రపక్షంగా ఉండేది. ఈ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించి శిరోమణి వైదొలగింది. బీజేపీకి గుడ్ బై చెప్పింది. ఈ క్రమంలోనే రైతులకు మద్దతు తెలుపుతూ ఇప్పుడు ఏకంగా బీజేపీపై తీవ్ర విమర్శలుచేశారు సుఖ్బీర్ సింగ్.