మాజీ సీఎం పరిస్థితి విషమం..

Update: 2020-05-09 12:30 GMT
దేశంలోనే ఒకప్పుడు వెలుగు వెలిగిన నేత ఇప్పుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. నాటి యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టిన మాజీ సీఎం, దేశంలోనే సీనియర్ నేత అజిత్ జోగి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది.

74 ఏళ్ల అజిత్ జోగి శనివారం ఉదయం ఇంటి సమీపంలోని గార్డెన్ లో ఉండగా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన అక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు రాయ్ పూర్ లోని శ్రీనారాయణ ఆస్పత్రికి తరలించారు.

అజిత్ జోగి పరిస్థితి విషమంగానే ఉందని ఆయనకు చికిత్స చేస్తున్న ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామన్నారు.

అజిత్ జోగి ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారుడు అమిత్ జోగి మీడియాతో మాట్లాడారు. తన తండ్రికి వెంటిలేటర్ పై చికిత్స అందుతోందని.. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు తలెత్తడంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామన్నారు.
Tags:    

Similar News