ఆ 5 భారతీయులను అప్పగిస్తున్న చైనా
అరుణాచల్ ప్రదేశ్ లో ఈనెల 1న చైనా భూభాగంలోకి ప్రవేశించి గల్లంతైన ఐదుగురు భారతీయులను చైనా సైన్యం తాజాగా ఇండియాకు అప్పగించేందుకు అంగీకరించింది. ఈ మేరకు చైనా సైన్యం ఒక ప్రకటన జారీ చేసిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు ట్వీట్ చేశారు.
శనివారం సరిహద్దుల్లో ఐదుగురు భారతీయులను భారత్ కు అప్పగించనున్నారని కేంద్రమంత్రి తెలిపారు. వారంతా క్షేమంగా చైనా సైన్యం వద్ద ఉన్నారని.. వారిని ఈరోజు అప్పగిస్తున్నారని ఆయన తెలిపారు.
కాగా వీరు వేటగాళ్లు అని.. వేటాడుతూ చైనా భూభాగంలోకి వెళ్లిపోయారని భారత్ అంటోంది. వీరి కుటుంబాలు మాత్రం తమ వాళ్లు భారత జవాన్లకు నిత్యావసరాలు తీసుకెళ్లే వారని పోర్టర్లు చెబుతున్నాయి.
లఢక్ లోని అప్పర్ సుభాన్ సిరి ప్రాంతంలో ఈ ఐదుగురు దారి తప్పి అవతలి చైనా భూభాగంలో ఎంటరయ్యారని సమాచారం. వీళ్లు తమ ఆధీనంలో ఉన్నారని చైనా సైన్యం ఈనెల 8న ప్రకటించింది. తాజాగా వారి అప్పగింతకు ఓకే చెప్పింది.
చైనా, భారత్ ఉద్రిక్తతల నేపథ్యంలో చర్చలు జరిపి శాంతిమంత్రం జపించడంతో చైనా ఈ పరిణామానికి ఒప్పుకున్నట్టు తెలిసింది.