చత్తీస్ ఘడ్ లో తుది దశ పోలింగ్

Update: 2018-11-20 08:16 GMT
తెలంగాణలో నామినేషన్ల ఘట్టం పూర్తయిన వేళ.. పొరుగున ఉన్న చత్తీస్ ఘడ్ లో తుది దశ పోలింగ్ ఈరోజు కొనసాగుతుండడం విశేషం. మొత్తం 5 రాష్ట్రాలకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేయగా తొలిదశలో చత్తీస్ ఘడ్ ఉంది. చివరి దశలో తెలంగాణ ఉండడంతో ఇక్కడ డిసెంబర్ 7న పోలింగ్ నిర్వహిస్తున్నారు.

చత్తీస్ ఘడ్ లో తుది దశ పోలింగ్ ఈరోజు కొనసాగుతోంది. 19 జిల్లాల్లోని 72 నియోజకవర్గాల్లో ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 90 స్థానాలు ఉన్నా చత్తీస్ ఘడ్ అసెంబ్లీలో తొలి దశలో 18 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఎన్నికల బహిష్కరణకు మావోల పిలుపు నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించారు.

చత్తీస్ ఘడ్ లో మొత్తం 19296 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. రమణ్ సింగ్ ప్రభుత్వంలోని 9 మంత్రులు, స్పీకర్ - కాంగ్రెస్ చీఫ్ సహా అజిత్ జోగి కీలక నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల భవితవ్యం ఈరోజు ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది.

చత్తీస్ ఘడ్ లో వరుసగా మూడుసార్లు బీజేపీ గెలుపొందింది. రమణ్ సింగ్ అప్రతిహతంగా పాలిస్తున్నారు. 15 ఏళ్లుగా ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఈ సారి సర్వశక్తులు ఒడ్డుతోంది. బీఎస్పీ - అజిత్ జోగి - జనతా కాంగ్రెస్ - సీపీఐలు కూటమిగా బరిలోకి దిగాయి.
    

Tags:    

Similar News