కంగనాను అడ్డుకున్న రైతులు.. రణరంగం

Update: 2021-12-03 13:30 GMT
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కారును పలువురు రైతులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పంజాబ్ లోని కీరత్ పురలో శుక్రవారం అడ్డుకొని నిరసన తెలిపారు. చండీఘడ్-ఉనా హైవేపై ఉన్న కీరత్ పూర్ సాహిబ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

పెద్దసంఖ్యలో పంజాబ్ రైతులు ఆమె కారును అడ్డుకున్నారని..పోలీసులు అక్కడ కనిపించారని ఘటనాస్థలికి సంబంధించిన విజువల్స్ ను బట్టి తెలుస్తోంది.

అయితే కంగానా రనౌత్ కారుపై దాడి గురించిన సమాచారం ఏదీ తన వద్ద లేదని రైతు నేత రాకేష్ టికాయిత్ తెలిపారు. ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్న తర్వాతే స్పందిస్తానని ఆయన తెలిపారు.

ఇక రైతు నిరసనలపై తాను పోస్టులు చేసినప్పటి నుంచి నిరంతరం తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ కంగనా రనౌత్ గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విచ్చిన్నకర శక్తుల నుంచి తనకు ఈ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు. బథిండాకు చెందిన ఒక వ్యక్తి అయితే తనను చంపుతానని బెదిరించాడని.. అయితే ఈ తరహా బెదిరింపులకు తాను భయపడేది లేదని ఆమె అన్నారు.

దేశానికి వ్యతిరేకంగా కుట్ర చేసేవారిపై తాను మాట్లాడుతూనే ఉంటానని అన్నారు. అమాయక జవాన్లను చంపుతున్న నక్సల్స్ కావచ్చు.. టుక్డే టుక్టే గ్యాంగులు కావచ్చు.. విదేశాల్లో ఉంటూ ఖలిస్థాన్ కలలు కంటున్న టెర్రరిస్టులు కావచ్చు..వారు ఎవరైనా సరే తాను వారికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటానని కంగనా స్పష్టం చేశారు.
Tags:    

Similar News