కేజీఎఫ్​లో బంగారు గనుల్లో త్వరలో తవ్వకాలు .. కార్మికులు ఫుల్​ హ్యాపీ..!

Update: 2020-12-11 07:12 GMT
కర్ణాటకలోని కోలారు జిల్లా కేజీఎఫ్​లో బంగారు గనుల్లో త్వరలో తవ్వకాలు ప్రారంభించనున్నట్టు సమాచారం.  దీంతో అక్కడి కార్మికులు సంతోషంగా ఉన్నారు. త్వరలో తవ్వకాలు ప్రారంభిస్తామని ప్రజాప్రతినిధులు, మంత్రులు చెబుతున్నారు. కానీ ఇప్పటివరకు అధికారిక సమాచారం అయితే బయటకు రాలేదు. కేజీఎఫ్​ (కోలారు గోల్డ్​ఫీల్డ్స్​) ప్రాంతం బంగారు గనులకు ప్రసిద్ధి. కానీ 2001లో ఇక్కడ తవ్వకాలు ఆపేశారు. తవ్వడానికి ఎక్కువ ఖర్చుకావడం.. ముడి సరుకు తక్కువగా లభిస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. కానీ తాజాగా మరోసారి ప్రభుత్వం తవ్వకాలు పునః ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నది. కేజీఎఫ్​ ప్రాంతంలో తవ్వకాలు నిలిపివేయడంతో వేలసంఖ్యలో ప్రజలు ఉపాధి కోల్పోయారు.  దేశంలోని వివిధ రాష్ట్రాల కార్మికులు ఇక్కడ స్థిరపడ్డారు. ఇక్కడ పనిచేసే కార్మికులు ఒక్కొక్కరూ స్థిరనివాసం ఏర్పరుచుకోవడంతో కేజీఎఫ్​ సిటీ ఏర్పడింది.

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక చెందిన కార్మికులు ఇక్కడ ఉంటారు. అందుకే దీన్ని మినీ ఇండియాగా పిలుస్తుంటారు.  బ్రిటిష్​ కాలం నుంచి ఇక్కడ తవ్వకాలు జరిపేవారు. అందుకే ఇప్పటికీ అక్కడ పలువురు ఆంగ్లో ఇండియన్స్​కు  ఉన్నారు. అయితే ఇటీవల కర్ణాటక మంత్రి ప్రహ్లాద్​జోషి చేసిన ప్రకటన కార్మికుల్లో సంతోషం నింపింది.ప్రస్తుతం ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ది చెందింది కాబట్టి దాన్ని ఉపయోగించి తక్కువ ఖర్చుతోనే బంగారాన్ని వెలికితీయొచ్చని ఆయన ప్రకటించారు.

ఇప్పటికే పట్టణంలోని అనేక చోట్ల మట్టిని సేకరించి పరీక్షలకు పంపారు. చాలా చోట్ల గొట్టపుబావులు కూడా తవ్వారు. గతంలో టన్ను ముడి ఖనిజాన్ని శుద్ధిచేస్తే నాలుగు గ్రాముల బంగారం వచ్చేది.  దానికి చాలా ఆలస్యం అయ్యేది. దీంతో ఈ పని ఎంతో రిస్క్​తో కూడుకున్నది కావడంతో బంగారం తవ్వకాలు నిలిపివేశారు. బంగారు గనుల్లో తవ్వకాలు చేపడతామని ఎంపీ మునిస్వామి కూడా ఇటీవల ప్రకటించారు. కానీ కోలారు జిల్లా పాలనాధికారి సత్యభామ ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘బంగారు గనులు వెలికితీసే విషయం మాకు ఇంతవరకు తెలియదు. దీనిపై అధికారిక సమాచారం ఏది రాలేదు.’ అని చెప్పారు.
Tags:    

Similar News