బ్రేకింగ్: బొగ్గు స్కాంలో కేంద్రమాజీ మంత్రికి మూడేళ్ల జైలు
బొగ్గు గనుల కేసులో కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రేకు మూడేళ్ల జైలు శిక్ష ఖరారైంది. మరో ఇద్దరు అధికారులను కూడా దోషులుగా నిర్ధారించి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 10 లక్షల జరినామా విధించింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు.
1999లో అటల్ బీహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో జార్ఖండ్‌లో బొగ్గు గనుల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ ప్రత్యేక కోర్టు దర్యాప్తు చేపట్టింది. ఆ సమయంలో దిలీప్ రే బొగ్గుగనుల సహాయ మంత్రిగా ఉన్నారు.ఈనెల 6న మాజీ మంత్రి దిలీప్ రేను దోషిగా తేల్చిన కోర్టు సోమవారం జైలు శిక్ష ఖరారు చేసింది.
జార్ఖండ్ అంటేనే ప్రకృతి వనరులకు పెట్టింది పేరు. అక్కడ బొగ్గు సహా ఇతర ఖనిజాలు విస్తారంగా ఉన్నాయి. గిరిజన జనాభా ఎక్కువ. పైగా అడువులు విస్తరించి ఉన్నాయి. దీంతో అక్కడి నిక్షేపాలపై ఎప్పుడూ ఏదో ఒక వివాదం, కుంభకోణం చోటుచేసుకుంటూనే ఉంటుంది.
దేశంలోనే ప్రముఖమైన కుంభకోణంగా అప్పట్లో జార్ఖండ్ లో వెలుగు చూసిన బొగ్గు కుంభకోణం రాజకీయాలను షేక్ చేసింది. నాటి సీఎం ‘శిబుసోరేన్’పై కూడా దీనిపై ఆరోపణలు వచ్చాయి. అయితే ఆనాటి నుంచి ఇప్పటిదాకా ఈ కేసు విచారణ సాగుతూనే ఉంది.
ఈ బొగ్గు కుంభకోణం కేసులో ఢిల్లీ ప్రత్యేక కోర్టు తీర్పును వెల్లడించింది. కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రాయ్ తోపాటు మరో ముగ్గురిని దోషులుగా తేల్చింది. వారికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది.
1999లో జార్ఖండ్ లో బొగ్గు బ్లాక్ ల కేటాయింపుల్లో కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రాయ్ అక్రమాలకు పాల్పడినట్టు కోర్టు నిర్ధారించింది. వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర ఉక్కు, బొగ్గుగనుల శాఖ మంత్రిగా దిలీప్ రాయ్ పనిచేశారు. ఆ సమయంలోనే ఈ కుంభకోణం వెలుగుచూసింది. ఈ తీర్పు బీజేపీ ని ఇరుకునపెట్టినట్టైంది. ఇందులో బీజేపీ కేంద్ర మాజీ మంత్రి ఉండడంతో విమర్శలు చెలరేగుతున్నాయి.