ట్రంప్ తో ఎఫైర్ నడిపానంటూ ప్లేబాయ్ మోడల్..

Update: 2018-03-21 07:53 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో సాగించిన రాసలీలలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఆయన పోర్న్ స్టార్ అయిన డానియల్ తో ఎఫైర్ నడిపిన విషయం ఇప్పటికే బయటికి వచ్చింది. తాజాగా ట్రంప్ 10 నెలల పాటు తనతో వివాహేతర సంబంధం నడిపినట్లు ప్లేబాయ్ మాజీ మోడల్ కరెన్ మెక్‌ డౌగల్ అంటోంది. ఈ మేరకు ఆమె లాస్ ఏంజిల్స్ సుపీరియర్ కోర్టులో దావా కూడా వేయడం గమనార్హం.

రాజకీయాల్లోకి రాకముందే ట్రంప్ అపర కుబేరుడు. రియల్ ఏస్టేట్ వ్యాపారిగా వేల కోట్లు సంపాదించాడు. శృంగార ప్రియుడైన ఆయన ఎంతోమంది మహిళలతో రాసలీలు సాగించినట్లు ముందు నుంచే ఆరోపణలున్నాయి. ఎన్నికల ప్రచారంలోనూ దీనిపై పెద్ద చర్చ జరిగింది. పోర్న్ స్టార్ డానియెల్‌ తో తనకున్న సంబంధం బట్టబయలు కాకుండా ఆమెతో ఎన్నికలకు ముందు భారీ ఒప్పందం చేసుకున్న సంగతి కూడా ఇటీవలే బయటికి వచ్చింది.

ప్లేబాయ్ మాజీ మోడల్ కరెన్ మెక్ డౌగల్ తో సైతం ట్రంప్ ఇలాంటి ఒప్పందమే చేసుకున్నాడట. ట్రంప్ తో ఎఫైర్ గురించి తాను వెల్లడించకుండా ఓ మీడియా సంస్థతో తాను చేసుకున్న ఒప్పందం నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించడం గమనార్హం. ఒప్పందం కింద ఆ మీడియా సంస్థ తనకు లక్షా 50వేల డాలర్లు చెల్లించిందని ఆమె తన దావాలో పేర్కొంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తో మెక్‌ డౌగల్ ఎపైర్ గురించి కథనాన్ని ప్రచురించే హక్కులను ఆమె నుంచి మీడియా సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఐతే ఇప్పటివరకు ఈ ఎఫైర్ గురించి కథనాలు రాలేదు. 2006-07 మధ్య సుమారు 10 మాసాల పాటు ట్రంప్‌ తనతో ఎఫైర్ నడిపాడని మెక్ డౌగల్ అంటోంది. ఆ సమయంలో ట్రంప్ భార్య మెలానియా గర్భవతిగా ఉండటం గమనార్హం.


Tags:    

Similar News