మహ్మమారి ఆ దేశ ప్రధాని ప్రాణం తీసింది

Update: 2020-12-14 12:30 GMT
ప్రపంచాన్ని వణికించిన మహమ్మారికి చిన్నా పెద్దా.. ధనిక పేద లాంటి తారతమ్యాలు అస్సులు ఉండవన్నది తెలిసిందే. చేతిలో అధికారం ఉన్నా లేకున్నా ఎవరినైనా తన కోరలతో విలవిలలాడేలా చేయటమే దాని పని. ఇప్పటికే దీని బారిన పడిన పలువురు ప్రముఖులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తాజాగా ఆ జాబితాలో ఒక దేశ ప్రధాని చేరారు.బ్యాడ్ లక్ ఏమంటే.. సదరు ప్రధాని కరోనా ను జయించలేక శాశ్విత నిద్రలోకి జారుకున్నారు.

ఆఫ్రికాలోని చిన్నదేశమైన ‘ఎస్వాతీనీ’ ప్రధాని తాజాగా కోవిడ్ 19 బారిన పడి మరణించారు. హైదరాబాద్ మహానగర జనాభాలో కేవలం పది శాతం మాత్రమే అంటే.. 12 లక్షలు ఉండే ఆ చిన్నిదశానికి ప్రధానిగా 52 ఏల్ల మాండ్వులో లామిని వ్యవహరిస్తున్నారు. నాలుగు వారాల క్రితం ఆయన ఈ మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ఆయన్ను దక్షణాఫ్రికాలోని ఒక ఆసుపత్రికి తరలించి.. చికిత్స చేస్తున్నారు.

ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. చికిత్సకు బాగా స్పందిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అనూహ్యంగా ఆయన ఆరోగ్యం ఆదివారం విషమించింది. దీంతో ఆయన అర్థరాత్రి సమయంలో కన్నుమూసినట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. 2018 నవంబరులో ఎస్వాతీని దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ప్రధాని పదవిని చేపట్టటానికి ముందు దాదాపు 18 ఏళ్ల  పాటు బ్యాంకింగ్ రంగంలో సేవలు అందించిన ఆయన.. ప్రధాని అయ్యారు. ఈ చిన్నిదేశంలో ఇప్పటివరకు 6768 కరోనా కేసులు నమోదుకాగా.. 127 మంది ప్రాణాలు పోయినట్లుగా చెబుతున్నారు. తాజాగా దేశ ప్రధాని ప్రాణాలు కరోనా కారణంగా బలి కావటంతో ఆ దేశం ఇప్పుడు విషాదంలో మునిగిపోయింది.
Tags:    

Similar News