ఎన్నికలు: ప్రతి మంత్రి - ఎమ్మెల్యేకు జగన్ టార్గెట్
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రగులుకుంటోంది. పంచాయితీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో జరిగిన న్యాయ పోరాటంలో ఓడిపోయిన తరువాత వైఎస్‌ఆర్‌సి పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలను చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
వైయస్ఆర్సి దాదాపు అన్ని గ్రామ పంచాయతీలను ఎక్కువగా ఏకగ్రీవంగా చేజిక్కించుకోవాలని జగన్ తన సీనియర్ పార్టీ నాయకులందరికీ సీరియస్ గా చెప్పినట్టు తెలిసింది. ఎన్నికలు పార్టీయేతర ప్రాతిపదికన జరిగినప్పటికీ క్షేత్రస్థాయిలో, పోటీదారులకు ఖచ్చితంగా ఒక పార్టీకి లేదా మరొక పార్టీకి అనుబంధం ఉంటుంది. ప్రతిపక్షాలకు ఎటువంటి చాన్స్ ఇవ్వకుండా, గ్రామ పంచాయతీలను చేజిక్కించుకోవడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించాలని జగన్ దిశానిర్ధేశం చేసినట్టు సమాచారం.
ఏకగ్రీవాల కోసం నగదు ప్రోత్సాహకాలను ఏపీ ప్రభుత్వం ప్రకటించడం ద్వారా ఎన్నికలను ఏకగ్రీవంగా గెలవడానికి ఒక మార్గం చిక్కింది. "వేలం" ద్వారా సర్పంచ్ పదవిని స్వాధీనం చేసుకోవడానికి అదనపు ప్రోత్సాహకాలను అందించాలని పార్టీ నాయకులకు జగన్ సూచించినట్టు తెలిసింది.పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, జగన్ ప్రతి ఎమ్మెల్యేకు తమ నియోజకవర్గాల్లోని గ్రామ పంచాయతీలలో 80-90 కంటే తక్కువ కాకుండా వైయస్ఆర్సి అభ్యర్థులకు విజయాన్ని సాధించిపెట్టాలని లక్ష్యాలను నిర్ధేశించినట్టు సమాచారం.
"ఏకగ్రీవ ఎన్నికలు సాధ్యం కానీ చోట, ఎమ్మెల్యేలు ఎన్నికలలో గెలిచిన వారిని వైసీపీలో చేరేలా ప్రయత్నాలు చేయాలి" అని జగన్ హితబోధ చేసినట్టు సమాచారం. పంచాయతీ ఎన్నికలలో విజయం సాధించడానికి వ్యూహాల అమలుపై పర్యవేక్షించాలని జిల్లాల్లో క్యాంప్ చేయమని.. స్థానిక ఎమ్మెల్యేలతో పాటు జిల్లాల్లోని ఇన్‌ఛార్జి మంత్రులను ఇందులో భాగస్వాములను చేశారు. అవసరమైతే, వారు అభ్యర్థుల కోసం ప్రచారం చేయడానికి గ్రామాలలో కూడా పర్యటించాలని జగన్ సూచించారు.
తన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ముఖ్యంగా నగదు బదిలీ పథకాలు పంచాయతీ ఎన్నికల్లో తనకు గరిష్ట మైలేజీని ఇస్తాయని జగన్ నమ్మకంగా ఉన్నారు. "పెన్షన్ల పంపిణీ.. ఇటీవల ప్రవేశపెట్టిన పథకాలు పంచాయతీ ఎన్నికలలో గెలవడానికి సరిపోతాయని జగన్ చెప్పినట్టు తెలిసింది.