జీవీకే గ్రూప్ పై ఈడీ మనీలాండరింగ్ కేసు

Update: 2020-07-07 17:40 GMT
ముంబై ఎయిర్ పోర్ట్ స్కాంలో జీవీకే గ్రూపు చైర్మన్, ఆయన కొడుకుపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. జీవీకే గ్రూప్, ప్రమోటర్లు, ముంబై ఎయిర్ పోర్ట్ లిమిటెడ్, మరికొన్న సంస్థలపై ఈడీ మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసిందని సమాచారం.

ఈ కేసుతో సంబంధమున్న అందరు వ్యక్తులను ప్రశ్నించేందుకు ఈడీ సిద్ధమవుతోంది. కంపెనీల ఖాతాల పరిశీలన, నిధుల బదిలీని ఈడీ ప్రారంభిస్తోంది.ఆస్తుల అటాచ్ కు సిద్ధమవుతోంది.

అయితే ఈడీ నుంచి తమకు ఇంతవరకు ఎలాంటి నోటీసులు రాలేదని జీవీకే ప్రతినిధులు తెలిపారు.

ముంబై ఎయిర్ పోర్టు అభివృద్ధి కోసం 2006లో ఎయిర్ పోర్టు ఆథారిటీ ఆఫ్ ఇండియా, జీవీకే గ్రూపు ఒప్పందం చేసుకున్నాయి. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి నిర్వహణ కోసం ఈ ఒప్పందం జరిగింది. అయితే 2017-18లో 9 కంపెనీలకు బోగస్ వర్క్ కాంట్రాక్టులు ఇచ్చి రూ.310కోట్లు దారి మళ్లించినట్టు సీబీఐ గుర్తించి జీవీకే గ్రూపు అధినేత, ఆయన కుమారుడుతోపాటు మరికొందరిపై కేసు నమోదు చేసింది. తాజాగా ఈడీ కూడా కేసు నమోదు చేయడంతో జీవీకే గ్రూపు డొంక కదలనుంది.
Tags:    

Similar News